సోప్ అంటే జారే స్వభావం ఉంటుంది. అలాంటిది టెట్రాపాడ్ ఆకారంలో ఉండే సోప్ మాత్రం చేతిలో తడిసి ఉన్నా జారిపోకుండా ఉంటుంది. దీన్ని టెట్రాసోప్ అనే స్టార్టప్ తయార్డుచేసింది. ఎక్కువకాలం మన్నే లక్ష్యంతో ఈ సోప్ ను తయారుచేశారు. కొన్నేళ్ళనుంచి ఈ కంపెనీ సిలికాన్ అచ్చు ద్వారా ఇలాంటి ప్రత్యేకమైన సోపులు తయారు చేస్తున్నారు. ఈ సోఅనుపు కొన్ని రకాల నూనెలు, కొవ్వులతో తయారు చేశారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో.. వాటివల్ల పర్యావరణానికి నష్టమేమైనా జరిగిందా అనే వివరాలు ముద్రించి ఈ సోపును అమ్ముతున్నారు.
ఆ తరహా సోప్ ను తయారు చేసేందుకు నిధులు కావాలని టెట్రాసోపు కిక్‌స్టార్టర్‌లో అలా అడిగిందో లేదో.. దాదాపు 30 వేల హాంకాంగ్ డాలర్లు వచ్చేశాయి. దాంతో గతేడాది ఈ నిధులతో తయారుచేసిన సోపులను టెట్రాసోపు ప్రస్తుతం తమ వెబ్‌సైట్ ద్వారా అమ్మకాలు జరుపుతోంది. అయితే ఈ సోప్ ను కేవలం చేతులు కడుక్కునేందుకు మాత్రమే తయారు చేశారు... వందగ్రాముల టెట్రాసోప్ 30 రోజులపాటు వస్తుంది.