వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగన్ గుంటూరు జిల్లా లో సీఎం చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలలో అధికారంలోకి రావడం కోసం ప్రజలకు అబద్దాల హామీలు ప్రకటించి మోసం చేసి గెలిచారు అన్నారు.
అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువునా మోసం చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలను అవినీతిమయం చేశారు. చంద్రబాబు అయ్యాక కేవలం తన ధన దాహం కోసం ప్రభుత్వాధికారులను వాడుకుంటూ తన ఖజానాను నింపుకుంటున్నారు అని అన్నారు.
చంద్రబాబు సీఎం స్వయంగా అవినీతిలో భాగస్వామిగా ఉన్నారని జగన్ ఆరోపించారు. ఎమ్మెల్యేల నుంచి కలెక్టర్ల వరకు ఆపై చివరకు పెదబాబుకు సైతం వాటాలు ఉండటం బహిరంగ రహస్యమని తీవ్ర ఆరోపణలు చేశారు.
నాలుగేళ్లలో రాష్ట్రంలో పచ్చ చొక్కాలు తప్పించి సాధారణ ప్రజానీకం ఎవరూ సంతోషంగా లేరన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజలను మోసం చేయడానికి అబద్ధాల హామీలను ప్రకటించాలని చూస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ప్రజలు చంద్రబాబు చేతిలో మోసపోకుండా...రాష్ట్రాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
ఇటువంటి నాయకులు రాజకీయాలలో రాకుండా తమ ఓటుతో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. రాష్ట్రానికి ప్రాముఖ్యమైన ప్రత్యేక హోదా విషయంలో తన రాజకీయ మనుగడ కోసం కేంద్రంతో చేతులు కలిపి ఆంధ్ర ప్రజలను నిలువునా మోసం చేసిన చంద్రబాబుకి ఆంధ్ర ప్రజల ఉసురు తగులుతుందని అన్నారు జగన్.