నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా

Update: 2018-02-19 18:56 GMT

తగినంత నిద్ర లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరైన నిద్ర లేకపోవటం వలన అలసట, బలహీనత, ఒత్తిడి తలనొప్పులు, చికాకు, డిప్రెషన్ తో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్ర వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మన సొంతమవుతుంది. కాబట్టి నిద్రలేమి (ఇన్సోమ్నియా) సమస్యలకు క్రింద ఇచ్చిన పరిష్కారాలను పాటించడం తప్పనిసరి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1). నిద్రపోవడానికి రెండు గంటల ముందు వేడినీటి స్నానం చేయడం ద్వారా నిద్రలేమి (ఇన్సోమ్నియా) సమస్యను నివారించవచ్చు. వేడినీటి స్నానం వలన శరీరం అనేది విశ్రాంతి పొంది నరాలకు తగినంత ఉపశమనం లభిస్తుంది.

2). రెండు టీస్పూన్ల ఆపిల్ సిడర్ వినేగార్ ని అలాగే రెండు టీస్పూన్ల తేనెని ఒక గ్లాసుడు వెచ్చటినీళ్లలో కలపండి. ఈ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు తాగండి.

3). ఒక పాత్ర నిండా నీళ్లు తీసుకుని అందులో ఒక టీస్పూన్ మెంతిగింజలను కలపండి. వీటిని రాత్రంతా నానబెట్టండి. ఈ నీళ్లను వడగట్టి ప్రతిరోజూ తీసుకోండి. ప్రతి రోజు క్రమం తగ్గకుండా మెంతి నీళ్లు తాగటం ద్వారా శరీరం సరిగ్గా పనిచేస్తుంది. తద్వారా, సరైన నిద్ర కలుగుతుంది.

4). ఒక గ్లాసుడు పాలను మరిగించి అందులో ఒక టీస్పూన్ దాల్చినచెక్క పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు త్రాగండి. వెచ్చటి పాలను తీసుకుంటే మనసుతో పాటు శరీరం విశ్రాంతి పొందుతుంది.

5). నిద్రపోయే ముందు ఒక అరటిపండును తీసుకోవాలి. లేదా అరటిపండు సలాడ్ లో తేనెను కలిపి తీసుకోవాలి. అరటిపండులో ఇన్సోమ్నియాను అరికట్టే లక్షణాలు అనేకం కలవు. ఇందులో, ఐరన్, కేల్షియం తో పాటు పొటాషియం కలవు. ఇవి మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి.

6). రెండు కుంకుమ పువ్వు రెక్కలను ఒక కప్పుడు వెచ్చటి పాలలో కలిపి నిద్రపోవడానికి ముందు ఈ పాలను తీసుకోండి.

7). ఒక కప్ జీలకర్ర టీని తీసుకోవడం లేదా ఒక టీస్పూన్ జీలకర్ర పొడిని ఒక అరటిపండు గుజ్జులో కలిపి ఈ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు తీసుకోవాలి. మంచి నిద్రను ప్రోత్సహించే లక్షణాలు జీలకర్రలో అనేకం కలవు.

8). ఒక టేబుల్ స్పూన్ సోంపును గ్లాసుడు నీళ్లలో కలపండి. రెండు గంటల తరువాత ఈ నీటిని వడగట్టి తీసుకోండి. ఇది, నిద్రలేమి సమస్యను నివారిస్తుంది.

9). వెచ్చటి నీటిలో తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు తీసుకోవాలి. సహజమైన రా హానీలో ఇన్సోమ్నియాను అరికట్టే లక్షణాలు అనేకం ఉన్నాయి.

10).చమోమైల్ టీ లేదా గ్రీన్ టీ వంటి ఏవైనా మీకు నచ్చిన హెర్బల్ టీను నిద్రపోయే ముందు తీసుకోండి. మంచి నిద్రను ప్రోత్సహించడానికి హెర్బల్ టీస్ ఎంతగానో ఉపయోగపడతాయి.

Similar News