భారీ సునామి 384 మంది జలసమాధి

Update: 2018-09-30 02:29 GMT

సునామి, భారీ భూకంపాలకు కేర్ అఫ్ అడ్రస్ ఇండోనేషియా. అలాటి దేశంలో మరో భారీ భూకంపం  రూపంలో సునామి సంభవించింది. దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. సులవేసి ద్వీపంలోని పలూ పట్టణంలో దేశ, విదేశీ పర్యాటకులు బీచ్‌ ఫెస్టివల్‌కు సిద్ధమవుతున్న తరుణంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా రిక్టర్‌ స్కేలుపై 7.5  తీవ్రతతో భూకంపం, ఆ వెంటనే 4–6 మీటర్ల ఎత్తు రాకాసి అలలతో సునామీ వచ్చింది. దాదాపు 400 మంది జలసమాధి అయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న రక్షణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. శిధిలలో చిక్కుకున్న వారిని రక్షిస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులకు ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది. ఆసుపత్రులు సైతం సునామి దాటికి కూలిపోవడంతో ఆరుబయటే క్షతగాత్రులకు చికిత్సనందిస్తున్నారు. సముద్రతీరంలోని పలూ పట్టణం దాదాపుగా క్రుంగిపోయింది. ఎటు చూసినా శవాల గుట్టలే కనబడుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం 384 మంది చనిపోయారని వెల్లడవుతున్నా..  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు వెల్లడిస్తున్నారు. భూ ఉపరితలానికి పదికిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు.. సముద్రం పక్కనే ఉన్న కారణంగా సునామి ఏర్పడ్డట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. సునామీ బారిన పడిన ఇండోనేసియాను  ఆదుకుంటామని ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పష్టం చేశారు.

Similar News