దక్షిణాదిలో తనకు సినీ ఆఫర్లు తగ్గాయంటూ వస్తున్న ప్రచారాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఖండించింది. అవన్నీ అవాస్తవమని తెలిపింది. ఆ న్యూస్ తో తాను ఏకీభవించబోనని చెప్పింది. అలాగే సినిమాల ఎంపికలో తాను కొన్ని పొరపాట్లు చేసింది వాస్తవమేనని చెప్పింది. తెలిసి కూడా కొన్ని తప్పులు చేశానని చెప్పిన రకుల్.. ఒక్కోసారి అలా చేయాల్సిన పరిస్థితులు వస్తాయని తెలిపింది.
కొన్ని సందర్భాల్లో మొహమాటం వల్ల కొన్ని చేయాల్సి వస్తుందని... అవి కూడా తప్పులు జరగడానికి కారణమవుతాయని వెల్లడించింది. తన సినిమాలు కొన్ని పరాజయం కావడానికి పైవన్నీ కారణాలే అని చెప్పుకొచ్చింది. ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాననంటుంది ఈ అమ్మడు. ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన తన చిత్రం 'అయ్యారీ' నిరాశపరిచింది. అయినప్పటికీ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయని తెలిపింది. త్వరలోనే తెలుగులో, తమిళంలో ఒకొక సినిమా చేయబోతున్నట్టు చెప్పింది.