అల్లకల్లోలంగా అమెరికా..

Update: 2018-10-14 03:56 GMT

హరికెన్ ధాటికి అమెరికాలోని పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. 250 కిలో మీటర్ల ప్రచంఢ వేగంతో దూసుకొచ్చిన తుపాను ధాటికి ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి. తీరం దాటే సమయంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో మైకెల్ బీభత్సం సృష్టించింది.భారీ ఎత్తున పిడుగుల వర్షానికి ఇల్లు నెలమట్టం అయ్యాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఎటు చూసిన కుప్పలుగా శిథిలాలే కనిపిస్తున్నాయి. మైకెల్ లాంటి తుఫాన్ మాత్రం అమెరికా చరిత్రలోనే లేదు. 250 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన మైకెల్ ముందు ఇల్లు, భవనాలు నిలబడలేకపోయాయి. చెట్లు కూలిపోయాయి. తుఫాన్ ధాటికి మొత్తం 17 మంది చనిపోయారు. ఫ్లోరిడాలో ఎనిమిది మంది, వర్జినియాలో ఐదుగురు, నార్త్ కరోలినాలో ముగ్గురు, జార్జియాలో ఒకరు చనిపోయినట్లు అధికారికంగా తెలుస్తోంది.

Similar News