మనిషి మనుగడకు నీరు చాలా అవసరం. అందుకే వైద్యులు ప్రతి రోజు 8 గ్లాసుల నుండి 12 గ్లాసుల నీటిని త్రాగాలని చెప్తుంటారు. ప్రతి రోజు ఉదయాన్నే నిద్రలేచిన తరువాత ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు గనక త్రాగినట్టయితే శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ వేడి నీటిని త్రాగటం వలన ఊహించని ప్రయోజనాలు ఉంటాయని కొద్ది మందికి మాత్రమే తెలుసు. వాటిలో.. ముఖ్యంగా..
1. బరువు తగ్గే ఛాన్స్
వేడి నీరు ముఖ్యంగా బరువు తగ్గేందుకుసహాయపడుతుంది. రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగితే. శరీరంలో కొవ్వు కణజాలంను విచ్చిన్నం చేస్తుంది.
2. గొంతు సమస్యలు దూరం
వేడి నీరు గొంతు నొప్పి నివారణకు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు, కఫం కరిగించి శ్వాసనాళం నుండి తొలగిస్తుంది. దాంతో గొంతుకు ఉపశమనం కలిగి గొంతు సమస్యలు దూరమవుతాయి.
3. కాంతివంతగా శరీరం
వేడి నీరు శరీరంలో సమూల మార్పులు తీసుకొస్తుంది అందులో చర్మం అత్యంత కాంతివంతగా ఉండటానికి వేడి నీరు సహాయపడతాయి. అంతేకాక దెబ్బతిన్న చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.