కోడిగుడ్ల ద్వారా మనకు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటిల్లో మనకు శరీరానికి కావల్సిన శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం వంటి కీలక పోషకాలు ఉంటాయి. వీటితో మనకు పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అయితే నిత్యం ఒక కోడిగుడ్డును తినమని వైద్యులు చెబుతారు. మరి ఒక కోడిగుడ్డు చాలా, ఇంకా ఎక్కువ తినలేమా..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కోడిగుడ్డును ఉకడబెట్టుకుని పచ్చ సొనతోపాటుగా తింటే రోజుకు ఒక గుడ్డు చాలు. ఎందుకంటే పచ్చ సొనను కలిపితే మనకు నిత్యం అందే డైటరీ కొలెస్ట్రాల్‌లో 55 శాతం వరకు అందుతుంది. కనుక అది మన శరీరానికి మంచి చేస్తుంది. కాబట్టి రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డు తినవచ్చు. అయితే ఎక్కువ తినాలనుకుంటే మరో రెండు ఉడకబెట్టిన గుడ్లను తినవచ్చు. కానీ వాటిల్లో పచ్చ సొన తినరాదు. కేవలం తెల్లనిసొన మాత్రమే తినాలి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. ఇక మధుమేహం ఉన్నవారు వారానికి రెండు గుడ్లను తినవచ్చు. అది కూడా పచ్చ సొనతో కలిపి తినకుండా ఉంటే బెటర్. అయితే ఆరోగ్యవంతులెవరైనా రోజుకు ఒక కోడిగుడ్డును (పచ్చనిసొనతో కలిపి) నిర్భయంగా తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి..!