వర్షాకాలంలో తాజాగా!

Update: 2017-09-16 15:36 GMT

వర్షాకాలంలో ఆహారపరంగానే కాదు.. చర్మసంరక్షణ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి కూడా చర్మతత్వానికి నప్పేలా ఉంటే.. మరీ మంచిది. సరైన పోషకాలు లేకపోవడం, నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల కొందరి చర్మతత్వం పొడిగా ఉంటుంది. పైగా వాతావరణం చల్లగా ఉంటే ఈ సమస్య ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. మరి చర్మాన్ని తేమగా మార్చాలంటే ఎలా అంటారా.. చర్మానికి తరచూ మాయిశ్చరైజర్ రాస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ గులాబీనీరూ, గ్లిజరిన్ కలిపి చర్మానికి రాసుకుంటే పొడిబారకుండా ఉంటుంది. రోజులో నాలుగైదుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకుంటే జిడ్డుదనం తగ్గుతుంది. 
 

Similar News