గుండెపోటును ముందే గుర్తించచ్చు.. ఎలానో చూడండి

Update: 2017-12-13 07:33 GMT

ఆకాష్ మనోజ్ ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే  వైద్య సాహిత్యాన్ని చదవడం నేర్చుకున్నాడు. అతను 10 వ తరగతి చదువుతున్న సమయంలోనే, వేలమంది భారతీయులకు ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా చెప్పుకుంటున్ననిశ్శబ్ద గుండెపోటుని ముందుగానే అంచనా వేయడానికి ఒక  పరికరాన్ని కనిపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు..ఆకాష్ స్కూల్లో చదువుతున్నప్పుడే తన సొంత ఊరు హోసూర్ నుండి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్  లైబ్రరీకి వెళ్ళేవాడు, 

జర్నల్ వ్యాసాలు ఖరీదైనవి అవ్వటంవల్ల తాను చదువుకోవడానికి ఏకైక మార్గం లైబ్రరీ, అందుకోసం గంటకు పైగా ప్రయాణం చేసి లైబ్రరీకి చేరుకునేవాడు.. తనకు వైద్య శాస్త్రం అంటే అమితమైన ప్రేమ అందునా   కార్డియాలజీ అంటే మరీ ఇష్టంగా ఉండటం చేత ఎలాగైనా ఈ శాస్త్రంలో పట్టు సంపాదించాలని అనుకున్నాడు, కానీ తగిన వయసు, డబ్బు  లేకపోవడంతో లైబ్రరీలకు వెళ్ళేవాడు.. 

కేవలం పదిహేనేళ్ల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా కార్డియాలజీ మీద అంతర్జాతీయ సమ్మేళనాలలో పాల్గొనేంత నమ్మకం వున్నవాడు.. తన ప్రాజెక్ట్ గురించి అనర్గళంగా ప్రసంగించగలడు అదీ అందరికి అర్దమయ్యేట్టుగా.. అలాంటిది బోర్డు ఎగ్జామ్స్ తనకో పెద్ద విషయం కాదు.. 'బోర్డు పరీక్షల గురించి భయపడేవాళ్లను చాల మందిని చూసాను.. నేను వాటి కోసం చదువుతాను కానీ అవి నన్ను ఇబ్బంది పెట్టవు' అంటాడు మనోజ్ నమ్మకంగా..

ఆ పరికరం కనిపెట్టడానికి కారణం తాతగారి మరణం..!

మనోజ్ ను ఈ ప్రాజెక్ట్ చేపట్టడానికి పురిగొల్పింది తన తాతగారి మరణం.. అయన మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నా ఆరోగ్యాంగానే ఉండేవారు.. కానీ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.. అదే నిశ్శబ్ద గుండెపోటుని ముందుగానే గుర్తించే పరికరాన్ని కనిపెట్టడానికి కారణమైంది..

సాధారణంగా గుండెపోటుకు వుండే లక్షణాల్లో ముఖ్యంగా చెప్పుకునే ఛాతి నొప్పి, ఎడమ భుజం లాగడం లేదా శ్వాస లో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి కానీ నిశ్శబ్ద గుండెపోటు ఉన్న వ్యక్తికి ఇలాంటి లక్షణాలు కనిపించవు.. కానీ అధిక రక్తపోటు, అధిక కొవ్వు వంటివి నిశ్శబ్ద గుండెపోటుకు గురి చేస్తాయి.. 

నిశ్శబ్ద గుండెపోటు ఇంకోసారి గుండెపోటు రావడానికి కారణమవుతుంది.. అది ప్రాణాంతకం కావచ్చు.. అదే మరోసారి గుండెపోటు వచ్చినట్లయితే గుండె పని చెయ్యకుండా పోవడానికి దారితీయవచ్చు..

ఆకాష్ కనిపెట్టిన పరికరాన్ని మణికట్టు మీదగాని, చెవి వెనకగాని అతికించినట్టయితే ఒక చిన్న విద్యుత్ ప్రేరణను విడుదల చేస్తుంది.అది గుండెపోటు వచ్చే సమయంలో గుండె విడుదల చేసే ప్రోటీన్ ని ఆకర్షిస్తుంది.. ఆ ప్రోటీన్ పరిమాణం గనక ఎక్కువవున్నట్టయితే వెంటనే ఆ వ్యక్తికి వైద్య సహాయం అందించాలి.

అయితే ఈ పరికరం ప్రయోగదశలోనే వుంది మనుషులమీద కూడా ప్రయోగించి చూడాల్సి వుంది.. మనుషుల మీద విజయవంతంగా ప్రయోగించి చూసిన రెండు నెలల తరువాత దీన్ని మార్కెట్లో విడుదల చెయ్యవచ్చు..

' నేను ఇప్పటికే ఈ పరికరానికి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాను.. అంతేకాదు జీవ రసాయన శాస్త్ర శాఖతో ఒప్పందం చేసుకుంటాను.. ఇది ప్రజల మంచికోసం రూపొందించాను కనుక ఎ ప్రైవేట్ కంపెనీకో అమ్ముకునేకంటే భారత ప్రభుత్వాన్ని ఈ ప్రాజెక్ట్ ను చేపట్టమని కోరతాను.. కాగా అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (AIMS) లో కార్డియాలజీని అధ్యయనం చేయాలన్నది  ఆకాష్ లక్ష్యం..

అసలు నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏమిటి..?

*నిశ్శబ్ద గుండెపోటు వచ్చినప్పుడు సహజంగా గుండెపోటు సమయంలో ఉండే ఛాతీ నొప్పి, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉండవు..

*ఒకవేళ ఆ లక్షణాలు ఉంటే అవి  ఫ్లూ, అరుగుదలలేమి, కండరాలనొప్పి,  ముక్కుకు సంబధించిన రోగ లక్షణాలుగా సహజంగా కొట్టిపారేస్తుంటారు..

*గుండెపోటును గుర్తించడానికి ఈసీజీ, 2d ఎకో తీయించడమే సరియైన మార్గం..

 అయితే త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ పరికరం గ్లూకోమీటర్ కన్నా తక్కువగా అంటే రూ 900 ఉంటుందని ఆకాష్ అంటున్నారు.. 

 

Similar News