శాసనసభ సభ్యత్వం రద్దు కేసులో కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను హైకోర్టులో విచారించింది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 13కి వాయిదా వేసింది. కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ శాసన సభ్యత్వాన్ని పునద్ధరించాలంటూ కొద్ది రోజుల క్రితం హైకోర్టు తీర్పు ఇవ్వగా దానిని అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.