శృంగారంలో ప్రతీ భర్త భార్యను సుఖ పెట్టాలనే అనుకుంటారు. అందుకే యుద్ధానికి కావాలాల్సిన అస్త్రాలన్నీ సిద్ధం చేసుకొని వెళతాడు. తీరా యుద్ధంలో పాల్గొన్న తరువాత విజయం సాధించలేక ఢీలా పడిపోతుంటాడు. దీనికే కొంతమంది భర్తలు , భార్యలు అనుమానాలు పెంచుకుంటుంటారు. తమలో శృంగార సామర్ధ్యం తగ్గిపోయిందని, ఇక శృంగారానికి పనికి రావేమోనని ఆందోళనకు గురవుతుంటారు. అయితే కొన్ని సమస్యల వల్ల పురుషులు శృంగార పటుత్వం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
వాటిలో ముఖ్యంగా శృంగారంలో పాల్గన్న భర్త భార్యను సుఖపెట్టాలని ప్రయత్నాలు జరిపినా పని ఒత్తిడి వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, అలసట, చికాకుతో సెక్స్ లో ఆనందాన్ని పొందలేకపోతుంటారు. దీన్ని అరికట్టేలా భర్తలు శృంగారంలో పాల్గొనే సమయంలో బెడ్ రూం వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చుకోవాలని, శృంగారానికి ముందు ఆహారపు నియమాల్ని పాటించాలని అంటున్నారు.
కొన్ని సార్లు మనం తినే తిండి పై ప్రభావం చూపుతుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారు శృంగారంలో ఆనందాన్ని పొందలేరని వైద్యులు సూచిస్తున్నారు. వీటితో పాటు సెక్స్ కోసం కొంత మంది మందులు వాడేవారు సంభోగం జరిపే సమయంలో త్వరగా నీరసించిపోతారని తేలింది.
కొంతమంది ఘాటుగా ఉండాలని మద్యపానం సేవించి శృంగారంలో పాల్గొంటుంటారు. అలా చేయడం వల్ల పురుషుల వీర్యకణాల్ని నాశనం చేస్తాయి. దీంతో సెక్స్ పై ఆసక్తి తగ్గిపోతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
శృంగారంలో పటుత్వం తగ్గినప్పుడల్లా వ్యాయమం చేయండి.వ్యాయామంతో రక్త ప్రసరణ బాగా జరిగి చక్కటి శక్తి సామర్ధ్యాలు మీరు పొందుతారు.