ఆడవారిలో - ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్ లు లోపం వల్ల మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవి యుక్తవయసులో కొద్దికాలము పాటు కనిపించినా ఎటువంటి బాధ ఉండదు, వీటివలన ముఖముపై మచ్చలు ఏమి ఏర్పడవు. కానీ పెద్దగా ఉండే మొటిమల వల్ల మొహంపై మచ్చలు ఏర్పడి మంటపుట్టడం, అందవిహీనంగా కనిపించడం జరుగుతుంది. అయితే ఈ మొటిమల్ని వంటింటి చిట్కాలతో అరికట్టవచ్చు.
వాటిలో టమాటో - నిమ్మకాయ - టామోటా, నిమ్మరసాన్ని రెండింటిని ముఖానికి అప్లయ్ చేస్తే మొటిమలు దూరం అవుతాయి. కలబంద గుజ్జును, నిమ్మకాయ రసాన్ని కలిపి ఆ పేస్టు ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.
ఉల్లిపాయ రసంతో మొటిమల్ని అరికట్టవచ్చు. చిటికెడు పసుపు ,చిటికెడు నిమ్మరసాన్ని కలిపి వచ్చే పేస్టును మొటిమలు ఉండే ప్లేస్ లో అప్లైయ్ చేస్తే ఎటువంటి మచ్చలున్నా తొలగిపోతాయి. బంగాళదుంప ముక్కల్ని మొహం పై ఉన్న మచ్చలపై రుద్దితే ఫలితం ఉంటుంది.
నిమ్మకాయ రసం అన్నీరకాల చర్మవ్యాదుల్ని అరికడుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ వల్ల విషపు కణాలు దూరం చేస్తుంది. మొహం పై ఉన్న మచ్చల్ని అరికట్టాలంటే నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది.
మనం మొహం ప్రకాశం వంతంగా బడాలంటే దోసకాయ మరియు పాలు, అందులో కొంచెం నిమ్మరసం కలిపి పూసుకుంటే మచ్చలుపోయి ఫేస్ గ్లో వస్తుంది.