ఇప్పుడు ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ కనిపిస్తున్నాయి. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ అర చేతిలో ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియాతో యువత ప్రతి క్షణం మునిగితేలుతున్నారు. అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి అంతర్జాలానికి బానిసలుగా మారే ప్రమాదకరం ఉందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్లు వాడుతున్న 300 మంది యూనివర్సిటీ విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని అధ్యయనకారులు పరిశీలించారు. ఈ పరిశీలనలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడే వారిలో మానసికంగా కుంగిపోయే లక్షణాలు కనిపించాయట.ఎంతలా అంటే కొద్ది సేపు నెట్ సేవలు ఆగిన తట్టుకోలేక పిచ్చెకెట్లుగా మారటాన్ని వారు గుర్తించారు. ఒత్తిడి ఉన్న సమయాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ద్వారా డిప్రెషన్ లోకి వెళ్తున్నారని వెల్లడించారు.
అందుచేత అతిగా ఫోన్ వాడకాన్ని తగ్గించుకోపోతే యువత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. కావున సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరానికి వాడుకోవాలి గాని బానిస కారాదు.