రెండురోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన పరిస్థితుల కారణంగా పసిడి ధర తగ్గినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.250 తగ్గి రూ.31,850కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా తగ్గింది. వెండి కిలోకు రూ.100 తగ్గి రూ.39,250కి చేరుకుంది. బంగారం తయారీదారుల నుంచి సరైన డిమాండ్ లేకపోవడంతో పాటు పరిశ్రమ వర్గాల నుంచి సైతం అనుకూల డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదిలావుంటే గత రెండు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.625 పెరిగింది.