మావోయిస్టుల చేతిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ లు
దారుణ హత్యకు గురైన నేపథ్యంలో మన్యంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత పెంచింది. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పొలిసుల భద్రతను పెంచారు. ఆమె ఇంటివద్ద అదనంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికైనా వెళ్లినపుడు తమకు సమాచారం ఇవ్వాలని ఆమెకు పోలీసులు సూచించారు. అలాగే ఎమ్మెల్యేకు ఇప్పుడున్న గన్‌మెన్‌లతో పాటు అదనంగా మరో గన్‌మెన్‌ను పోలీసుశాఖ ఏర్పాటు చేసింది. ఇదిలావుంటే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హత మార్చిన ఘటనలో పాల్గొన్న మావోయిస్టులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రత్యేక్ష సాక్షుల ద్వారా ముగ్గురు మావోయిస్టుల వివరాలను సేకరించిన పోలీసులు వాటిని మీడియాకు విడుదల చేశారు.