గబ్బర్ సింగ్-3 వస్తుందా ? రాదా ?

Update: 2018-03-10 17:07 GMT

హిందీలో ‘దబంగ్ 3’కి రంగం సిద్ధం అవుతోంది. ఇక థ‌ర్డ్ పార్టుకు దర్శకుడు కూడా ఖరారు అయ్యాడు. ఆయ‌న ఎవ‌రో కాదండి..  ప్రభుదేవా. సల్మాన్ తో ‘పోకిరి’ రీమేక్ ‘వాంటెడ్’కు దర్శకత్వం వహించిన ప్రభుదేవ ఇప్పుడు సల్లూ సూపర్ హిట్ దబంగ్ కు మూడో పార్టును తీయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుదేవ ధ్రువీకరించాడు. సల్మాన్ తో సినిమా అంటే అంతకన్నా ఆనందం లేదని ప్రభుదేవ అన్నారు. హిట్లూ ఫ్లాఫ్ లకు అతీతమైన హీరో సల్లూ అంటూ  కితాబిచ్చాడు. 

2010లో దబంగ్ ఫ‌స్ట్ పార్ట్ తెర‌పైకి వ‌చ్చింది. రెండేళ్ల  తర్వాత దబంగ్-2 తెర‌పైకివ‌చ్చింది. తొలి పార్టు సంచలన విజయం సాధించింది. బాలీవుడ్ కలెక్షన్ల చరిత్రను కొత్తగా లిఖించింది. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లోకూడా రీమేక్ అయ్యింది. ఇక్కడా విజయవంతమైంది.ఇక హిందీలో దబంగ్-2 వచ్చింది. ఇదీ హిట్ అయ్యింది. అయితే ఫస్ట్ పార్టు రేంజ్ లో ఆడ‌లేదు కానీ.. ఇప్పుడు మూడో పార్టుకు రెడీ అవుతున్నారట. 

మూడో పార్టులో కూడా నటీనటులంతా వాళ్లేన‌ని, దర్శకుడు మాత్రం ప్రభుదేవా అని తెలుస్తోంది. మరి తెలుగులో దబంగ్ కు రీమేక్ గా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా సర్ధార్ గబ్బర్ సింగ్ తెర‌పైకి వ‌చ్చింది. హిందీలో మూడో పార్టు వస్తోంది.. ఇక ఇదికూడా తెలుగులో కూడా గబ్బర్ సింగ్ -3 వస్తుంద‌ని అంతా అనుకుంటున్నారు. చూడా మ‌రి గ‌బ్బ‌ర్ సింగ్ -3 వ‌స్తుందా ? అన్న‌ది మాత్రం.
 

Similar News