కళ్లు చుసిన ప్రతిదీ కావాలని మనసు కోరుకోకూడదు. మనసు అడిగిన ప్రతిదీ కావాలని కాళ్లు వెళ్ళకూడదు . శరీరం అడిగిన ప్రతిదీ దొరికితీరాలని బుద్ధి పట్టు పట్టకూడదు .
రావణ వధ జరిగింది . మండోదరి ఏడుస్తూ రావణుడి తల ఒళ్ళో పెట్టుకుని - శవాన్ని సంబోధిస్తూ ఒక మాట అంది .
నిన్ను రాముడు చంపాడని అందరూ అంటున్నారు . కానీ నాకు నిజం తెలుసు . రాముడు కాదు నిన్ను చంపింది . నువ్వు ఇంద్రియాలను జయించలేక వాటికి లొంగిపోయావు . తపస్సువల్ల కొంత తొక్కిపెట్టావు . పాము పడగను కాలితో అణచినట్లు ప్రవర్తించావు . కాలు పక్కకు తీయగానే ఆ ఇంద్రియాలే నిన్ను కాటువేసి చంపేశాయి .
మండోదరి విశ్లేషణకు సాక్షాత్తు రాముడే ఆశ్చర్యపోతాడు .
మనం కూడా ఇంద్రియాలను జయిస్తున్నామా ? ఇంద్రియాలను తొక్కిపెడుతున్నామా ? ఇంద్రియాలకు లొంగి పోతున్నామా ? ఇంద్రియాలను సుఖపెట్టడానికి జన్మను , శరీరాన్ని పణంగా పెడుతున్నామా ? పరీక్షించుకోవాలి .