OPG First Electric Scooter: ఓపిజి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలోనే లాంచ్..!
OPG First Electric Scooter: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025 జనవరి 17 నుండి 22 వరకు ఢిల్లీలో జరుగుతుంది.
OPG First Electric Scooter: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025 జనవరి 17 నుండి 22 వరకు ఢిల్లీలో జరుగుతుంది. OPG మొబిలిటీ (గతంలో ఒకాయ EV) ఈ ఎక్స్‌పోలో అనేక కొత్త ఉత్పత్తులను పరిచయం చేయనుంది . OPG మొబిలిటీ తన ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్‌ను విస్తరించేందుకు ఫెర్రాటో బ్రాండ్‌తో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'డిఫై 22'ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 'Defy 22' కొత్త స్టైల్, పనితీరు, భద్రతా ఫీచర్లతో డిజైన్ చేశారు. ఇది ఈ స్కూటర్ మార్కెట్లో కొత్త గుర్తింపును సృష్టించడమే కాకుండా, OPG మొబిలిటీ ప్రధాన విలువలు, విష్కరణలను కూడా ప్రతిబింబిస్తుందని కంపెనీ నమ్ముతుంది.
OPG మొబిలిటీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్‌ను విడుదల చేసింది. స్కూటర్ ఎలిజెంట్, క్లాసీ, బోల్డ్ డిజైన్‌ను ఈ వీడియోలో చూడచ్చు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా మాట్లాడుతూ డిఫై 22 కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే కాదని, ఇది మా బ్రాండ్ విలువలు, ఆవిష్కరణలకు ప్రతీక అని అన్నారు. ఇది సరికొత్త సేఫ్టీ ఫీచర్లు, బోల్డ్ డిజైన్‌ను కలిగి ఉంది.
ఒకాయ తన కొత్త బ్రాండ్ గుర్తింపులో భాగంగా దాని పేరును OPG మొబిలిటీగా మార్చుకుంది. ఈ మార్పు ద్వారా కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించాలని, అదేవిధంగా దాని విస్తృత డీలర్ నెట్‌వర్క్‌ను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది. OPG మొబిలిటీ రెండు కొత్త సబ్-బ్రాండ్‌లను కూడా పరిచయం చేసింది.
కంపెనీ కొత్త లోగో బ్లాక్, గ్రీన్ కలర్స్‌తో తయారు చేశారు. అందులోని బ్లాక్ కలర్ విశ్వసనీయత, ఆవిష్కరణకు బ్రాండ్ నిబద్ధతను సూచిస్తుంది. గ్రీన్ కలర్ పర్యావరణం పట్ల స్థిరత్వం, బాధ్యతను సూచిస్తుంది. OPG మొబిలిటీ భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తమ సంస్థ బలమైన ఉనికిని స్థాపించే లక్ష్యంతో ఈ చర్య తీసుకుంది.