Honda CB650R, CBR650R Launched: హోండా నుంచి స్పోర్ట్ బైక్స్‌.. 12,000 RPMతో రోడ్లు అదిరిపోతాయ్

Update: 2025-01-14 14:48 GMT

Honda CB650R, CBR650R Launched: హోండా నుంచి స్పోర్ట్ బైక్స్‌.. 12,000 RPMతో రోడ్లు అదిరిపోతాయ్

Honda CB650R and CBR650R Launched: జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ హోండా CBR650R స్పోర్ట్ బైక్‌లను త్వరలో భారతీయ మార్కెట్లో తిరిగి ప్రారంభించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం. ఈ ఫుల్ ఫెయిర్డ్, మిడిల్ వెయిట్, ఇన్‌లైన్-4 స్పోర్ట్ ‌బైక్ మరికొద్ది వారాల్లో మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. 

ఈ హోండా ఇంజన్ బైక్ విషయానికొస్తే CBR650Rలో 648cc, 4-సిలిండర్, ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 12,000 RPM వద్ద 95hp పవర్, 9,500 RPM వద్ద 63Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంటుంది.

హోండా CBR650Rకి ఇప్పుడు కంపెనీ E-క్లచ్ టెక్నాలజీని అందించింది. దీని ద్వారా గేర్‌లను మార్చేటప్పుడు, ఆపే సమయంలో రైడర్ క్లచ్ లివర్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఈ సరికొత్త మోటార్‌సైకిల్‌లో 5-అంగుళాల TFT డాష్ ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు కాల్, నోటిఫికేషన్ అలర్ట్‌లు, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. ఇ-క్లచ్ ఫీచర్ ప్రత్యేక వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

స్టాండర్డ్ మోడల్ బరువు 208 కిలోలు, ఇ-క్లచ్ వేరియంట్ బరువు 211కిలోలుగా ఉంది. దీనితో పాటు నేకెడ్ CB650R కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. దీని ధర మునుపటి మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.35 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. రాబోయే హోండా CBR650R షార్ప్ లుక్స్, LED లైటింగ్‌తో 2 రంగులు ఎరుపు, స్టెల్థియర్ మ్యాట్ బ్లాక్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రారంభించిన తర్వాత, ఇది ట్రయంఫ్ డేటోనా 660 సుజుకి GSX-8R లతో పోటీపడుతుంది.

Tags:    

Similar News