Maruti Suzuki Eeco: 15 ఏళ్లు దాటినా ఈకోకు క్రేజ్ ఎందుకంటే?
మారుతి సుజుకి ఈకో భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. మారుతి సుజుకి ఈకో ఇప్పుడు 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.
Maruti Suzuki Eeco: మారుతి సుజుకి ఈకో భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. మారుతి సుజుకి ఈకో ఇప్పుడు 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. మారుతి సుజుకి ఈకో కారు తొలిసారిగా జనవరి 2010లో భారత మార్కెట్లో విడుదలైంది. ఈ 15 సంవత్సరాలలో మారుతి సుజుకి భారతదేశంలో 1.2 మిలియన్ ఈకో కార్లను విక్రయించింది. 1.2 మిలియన్ అంటే 12 లక్షల కార్లు. భారతీయ మార్కెట్‌లో మారుతి సుజుకి ఈకో ప్రస్తుతం కేవలం రూ.5.32 లక్షల ప్రారంభ ధరకే లభిస్తుంది. ఈ కారు టాప్ వేరియంట్ ధర రూ.6.58 లక్షలు మాత్రమే.ఈ తక్కువ ధర మారుతి సుజుకి ఈకో కారుకి అతిపెద్ద బలం.
మారుతి సుజుకి ఈకో కేవలం 5 సీట్లలో మాత్రమే కాకుండా 7 సీట్లలో కూడా అందుబాటులో ఉంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 81 పిఎస్ పవర్, 104.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కి 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. దీని మైలేజ్ 19.71 కెఎమ్‌పిఎల్.
మారుతి సుజుకి ఈకో CNG వేరియంట్ కూడా అదే 1.2-లీటర్ ఇంజన్‌తో రన్ అవుతుంది. పెట్రోల్ వేరియంట్ మాదిరిగానే CNG వేరియంట్ కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది. కానీ CNGతో నడుస్తున్నప్పుడు ఈ ఇంజన్ గరిష్టంగా 72 పిఎస్ పవర్, 95 ఎన్ఎమ్ టార్క్ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇది సిఎన్‌జితో నడుస్తున్నప్పుడు కిలోకు 26.78 కిమీ మైలేజీని ఇస్తుంది. మారుతి సుజుకి ఈకో భారతీయ మార్కెట్‌లో బాగా రాణించడానికి ఈ మంచి మైలేజ్ కూడా కారణం
మారుతి సుజుకి ఈకోలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. ఫీచర్లు కూడా తక్కువే. అయితే, 15 ఏళ్ల తర్వాత కూడా మారుతి సుజుకి ఈకో తక్కువ ధరతో అధిక మైలేజ్ ఇచ్చే వాహనం. దీంతో ఈ వాహనానికి మార్కెట్లో ప్రత్యేకమైన స్థానం ఉంది.మరో వైపు భారతీయ మార్కెట్లో దీనికి ప్రత్యక్ష పోటీదారుగా ఎవరూ లేరు.