Samsung Galaxy S23 Ultra: దిమ్మతిరిగే ఆఫర్.. లక్షా 49 వేల ఫోన్ సగం ధరకే

Update: 2025-01-15 14:32 GMT
Amazon offers 51 percent discount on Samsung Galaxy S23 Ultra 5G in Republic Day sale

Samsung Galaxy S23 Ultra 5G : దిమ్మతిరిగే ఆఫర్.. లక్షా 49 వేల ఫోన్ సగం ధరకే

  • whatsapp icon

Samsung Galaxy S23 Ultra: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ గత రెండు రోజులుగా లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో అద్భుతమైన డిస్కౌంట్లు, డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ప్రస్తుతం సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Galaxy S23 Ultra భారీ తగ్గింపులతో అందుబాటులో ఉంది. ఆఫర్లపై ఈ ఫోన్‌ను రూ.73,999కి మీ సొంతం చేసుకోవచ్చు. దీనిలో 200MP కెమెరా, 12GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఆఫర్స్

ఈ ప్రీమియం శాంసంగ్ ఫోన్ అసలు ధర రూ. 1,49,999. కానీ ప్రస్తుతం 51 శాతం తగ్గింపుతో రూ.73,999 ధరకే అందుబాటులో ఉంది. అయితే దీనితో పాటు, మీకు ఫోన్‌పై ప్రత్యేక కూపన్ తగ్గింపు రూ. 2,000 కూడా లభిస్తుంది. ఈ విధంగా, మీరు ఫోన్‌పై మొత్తం రూ.78,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్‌ ద్వారా ఫోన్ ధర మరింత తగ్గుతుంది.

శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫీచర్స్

సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 3088 x 1440 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.81-అంగుళాల 2X డైనమిక్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది LTPO 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది స్మూత్ విజువల్స్‌ను అందిస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా ఉంది. ఇది క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 12GB ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G కెమెరా విషయానికి వస్తే 200MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో ఉంటుంది. ఇది కాకుండా 10MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, మరొక 10MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది హై క్వాలిటీ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. అదనంగా, స్మార్ట్‌ఫోన్ ఎస్-పెన్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 45W వైర్డ్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది OneUI 5తో ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది.

Tags:    

Similar News