ఎనర్జీ డ్రింకులు అధికంగా తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అలాగే హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ఇటీవల ఎనర్జీ డ్రింక్‌లు అధికంగా తాగడం వల్ల కపాలానికి రంధ్రం పడి చనిపోయిన వ్యక్తి గురించి ఉదహరించింది.
ఆ డ్రింకుల్లో ఉండే కెఫైన్ శరీరంలో ముఖ్యమైన భాగాల మీద తీవ్రంగా ప్రభావం చూపుతుందని తెలిపింది. దీని వల్ల గుండె లయ తప్పడం, రక్త ప్రసరణలో అవరోధాలు ఏర్పడడం జరుగుతుందని చెప్పింది. ఇప్పటికే బీపీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారు ఎనర్జీ డ్రింకులకు దూరంగా ఉండాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సంస్థ కూడా సూచించింది. వాటికి బదులుగా సహజంగా లభించే పళ్లరసాలు, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని తెలియజేసింది.