పాప్ రారాజు మైఖెల్ జాక్సన్ చనిపోయిన తరువాత కూడా సంపాదిస్తున్నారు. అంతేకాదు అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో అయన మొదటి స్థానంలో ఉన్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ మేరకు చనిపోయిన తర్వాత కూడా డబ్బులు సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్.. ఇందులో మైఖేల్ జాక్సన్ గతేడాది 400 మిలియన్ డాలర్లు సంపాదించారు. అది.. జాక్సన్ కు చెందిన ఆల్బమ్స్ అన్ని సోనీ సంస్థ 287 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ మ్యూజిక్ ఆల్బమ్స్ అమ్మకాల ప్రక్రియ ద్వారా జాక్సన్ పరోక్షంగా దాదాపు 400 మిలియన్ డాలర్లు సంపాదించారు. అలా 2009లో చనిపోయిన జాక్సన్ ఇప్పటివరకు 1.8 బిలియన్ డాలర్స్‌ను సంపాదిస్తున్నారని ఫోర్బ్స్ పేర్కొంది.. ఆ తర్వాత స్థానంలో మ్యూజిక్ లెజెండ్ ఎల్విస్ ప్రెస్లే ఉన్నారు. 1977లో చనిపోయిన ఎల్విస్ ఇప్పటివరకు 31 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఇక మూడో స్థానంలో ఇక మూడో స్థానంలో 1929లో చనిపోయిన ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు ఆర్నాల్డ్ పామర్ ఉన్నారు. అయన ఇప్పటివరకు 27 మిలియన్ డాలర్లు సంపాదించారు. అయన తరువాత స్థానంలో గతేడాది చనిపోయిన ప్లేబాయ్ సంస్థ వ్యవస్థాపకుడు హ్యూగ్ హెఫ్నర్ ఉండగా. ఆయన గతేడాదిలో 11.7 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రముఖ గాయకుడు బాబ్ మార్లే, రచయిత స్యూస్, గాయని మార్నిల్ మన్రో లు ఉన్నారు.