దక్షిణ భారతదేశంలోని వంటకాల్లో ముఖ్యంగా వాడే నూనె కొబ్బరినూనె. కేరళ రాష్ట్రంలో కొబ్బరినూనె వంటకాలు ఎక్కువగా ఉంటాయి. కేరళ తరువాత శ్రీలంక, ఇండోనేషియా సహా మరికొన్ని ఆసియా దేశాల్లోనూ వంటల్లో కొబ్బరి నూనె బాగా వినియోగిస్తారు. ఐతే.. ఈ నూనెలో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి హానికరం అన్నది హార్వర్డ్ ప్రొఫెసర్, ప్రముఖ ఎపిడిమియాలజిస్ట్ కెరిన్ మిషెల్స్ చెప్తున్న మాట. సాధరణంగా ప్రతి నూనెలోనూ ఈ తరహా గాఢత ఎక్కువగా ఉండే కొవ్వు ఉంటుంది. వేరుసెనగ నూనె, చీజ్ ఇలా మనం తినే చాలా వాటిల్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువే. దీనివల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్టరాల్ పెరుగుతుందని, దీనివల్ల కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలు మూసుకుపోతాయని తద్వారా.. గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉందంటున్నారు. సాధారణ వంటనూనెలు కాకుండా కొబ్బరినూనె ఆయిల్ తింటే పాయిజన్ తిన్నట్టేనని అయన అంటున్నారు.