అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు కాల్చేస్తోంది. భీకరమైన మంటల కారణంగా ఇప్పటివరకు 71 మంది మరణించగా. 1000 మందికి పైగా ఆచూకీ లభించలేదు. వందలాదామంది గాయపడ్డారు. అయితే కాలిఫోర్నియా చరిత్రలోనే ఈ ప్రమాదం అతిపెద్దదని అధికారులు తేల్చారు. ఇప్పటివరకు 6వేల 5వందల నివాస ప్రాంతాలు బుగ్గిపాలయ్యాయి. దాదాపు 90వేల ఎకరాల భూమి కాలిబూడిదైంది.
మంటలను అదుపుచేసేందుకు 8వేల మంది నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య రోజు రోజుకో పెరుగుతోందని, పరిస్థితి దారుణంగా ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కార్చిచ్చును చల్లార్చడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముందన్నారు.