భరత్ అనే నేను మహేష్- కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను త్వరగా పూర్తి చేసుకుంటున్న యూనిట్.. సినిమా ప్రమోషన్స్ ను కూడా అంతే వేగంగా చేసింది. ఇప్పటికే టీజర్ తో సోషల్ మీడియా సంచలనంగా మారిన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈ వెంట్ కు గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది.
అద్భుతమైన మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ సాంగ్స్‌కి అంతకుమించిన విధంగా స్వరాలను సమకూర్చే పనిలో ఉన్నారు. కాగా భరత్ అనే ను సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ మొదటి వారంలో వైజాగ్‌లో నిర్వహించి... అక్కడే సాంగ్స్‌ను కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉంది సినిమా యూనిట్.
గతంలో కొరటాల-మహేష్-దేవి శ్రీ కాంబినేషన్‌లో విడుదలైన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ‘భరత్ అనే నేను’ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిపోయాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ జోడి కడుతుంది. ఇందులో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రను పోషిస్తున్నారు.
ఈ మూవీలో తమిళ సీనియర్ హీరో శరత్ కుమర్ మహేష్‌కు తండ్రి క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ మూవీలో మహేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.