జీవన విధానం యాంత్రికంగా మారడంతో తగిన వ్యాయామం లేక శరీర నియంత్రణ లేకుండా తయారవుతోంది. పైగా శరీరానికి అలసట లేకపోవడంతో నిద్ర సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా బీపీ, షుగర్, స్థూలకాయం లాంటి రుగ్మతల బారిన పడుతున్నారు. దీంతో చాలామంది వైద్యులు నడక (వాకింగ్) పై ఆసక్తి పెంచుతున్నారు. నడక శరీర నిర్మాణాన్ని మార్చు తుంది. నడకతో చాలా రకాల ఉపయోగా లున్నాయి. గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్, మానసిక ఒత్తిడి, రక్తపోటు, స్థూలకాయం, కొవ్వును తగ్గించి జీవిత కాలాన్ని పెంచుతుంది. దాంతో యువత, పెద్దలు ఎంత బిజిగా ఉన్నా నడకను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటున్నారు. ఉదయం పూట చాలామంది మార్నింగ్ వాక్ అంటూ తిరిగేస్తుంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వాకింగ్ చేయడం ఎంతో లాభదాయకం, రోజూ 45 నిమిషాల సేపు నడవడం వలన ఒత్తిడి దూరం అవుతుంది. శరీరానికి సాంత్వన లభిస్తుంది. నడక వలన శరీరంలోని అన్ని అవయవాలు సరిగా పనిచేస్తాయి. అలాగే రోజు వాకింగ్ చేయడంవలన రక్తప్రసరణ మెరుగవుతుంది. దాంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు అంటున్నారు. రోజు ఇలా చేయడంవలన రోజుకు 200 గ్రాముల కొవ్వు కరుగుతుందని అంటున్నారు. అంతేకాకుండా వాకింగ్ వలన మనిషి శరీరం అలసటకు గురై రాత్రివేళ ఆరోగ్యవంతమైన నిద్ర వస్తుంది. తద్వారా నిద్ర సమస్యలు తొలగిపోతాయి. అలాగే రోజు 45 నిమిషాల నడకవలన రోజంతా యాక్టీవ్ గా ఉండొచ్చని వైద్యనిపుణులు అంటున్నారు. సో.. ప్రతిఒక్కరు తమ రోజువారీ జీవన విధానంలో నడకను ఒక భాగంగా ఏర్పాటు చేసుకుంటే చింతలేకుండా జీవించొచ్చన్నమాట.