నిన్న(ఆదివారం) మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా మృతిచెందిన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు స్థానిక డుంబ్రిగుడ ఎస్‌ఐపై వేటు వేశారు. ప్రజాప్రతినిధులకు సరైన రక్షణ కల్పించలేదనే కారణంతో ఎస్‌ఐ అమ్మన్‌రావుపై వేటు వేశారు అధికారులు. ఇదిలావుంటే మావోయిస్టుల దుశ్చర్యకు నిరసనగా నేడు ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చాయి ప్రజాసంఘాలు. దీంతో అరకులోయాలో వాహనాల రాకపోకలు నలిచిపోగా.. దుకాణాలు మూతపడ్డాయి. నిన్న పోలీస్ స్టేషన్ పై దాడి జరగడంతో అరకులోయలో 144 సెక్షన్ విధించారు.