నా బ్ర‌తుకును బ‌స్టాండ్ చేశారు

Update: 2018-04-09 17:00 GMT

గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలోని ‘కాస్టింగ్ కౌచ్’... ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌‌లలో నానా హంగామా చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ దగ్గర హల్ చల్ చేసింది. చాంబర్‌ ఆవరణలో అర్ధనగ్నంగా నిరసన చేసింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి.. తాను ఇంతకాలంగా మొత్తుకుంటున్నా మా అసోసియేషన్ కాని, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు కాని తనను పట్టించుకోవడంలేదని పోయారు. తమ శవాలమీద బిల్డింగులు కట్టుకోండి అంటూ తెలుగు సినిమా పెద్దలమీద శ్రీరెడ్డి నిప్పులు చెరిగారు. పెద్దపెద్ద స్టూడియోల్లో పెద్దపెద్ద హీరోలు, హీరోయిన్ల రంకుపురాణాలు బయటపడతాయన్నారు. తెలుగు చిత్రసీమను నమ్ముకొచ్చిన తనకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. ఎంతకాలం తమ ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు తీసి మీకు పంపాలంటూ ఆమె ప్రశ్నించారు.
అయితే శ్రీరెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)  సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పనులు చేసిన ఆమెకు ఎట్టిపరిస్థితుల్లోనూ సభ్యత్వ కార్డు ఇవ్వబోమని, ఏదైనా సినిమాలో నటిస్తే అందులో 'మా'లోని 900 మంది సభ్యులు నటించబోరని తీర్మానించింది. 
అయితే శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) నిర్ణ‌యాన్ని త‌ప్ప‌బ‌ట్టింది. త‌నది చీప్ ప‌బ్లిసిటీ అంటున్నారు. సినిమాలు చేస్తుంటే  నాకు ప‌బ్లిసిటీ వ‌స్తుంది. అవే ఉంటే నేను బ‌ట్ట‌లిప్పాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌శ్నించింది. 
నాబ‌ట్ట‌లు నేను ఊడ‌దీసుకోలేదు.  మీరే తెలుగు కళామ తల్లి గుడ్డలు ఊడదీశారు. 'మా' సభ్యులంతా కలిసి నా బ్రతుకును బస్టాండ్ చేసి వదిలారు. మీరు చేయ‌ద‌లుచుకున్నారో చేసుకోండి. మీకు బ‌య‌ప‌డే చాలా మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. నేను బ‌ట్ట‌లిప్పింది ఇష్టంతో కాదు. బాధ‌తో  అలా చేయాల్సి వచ్చింది.
నాకు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప‌ట్టించుకోకుండా చలువ కళ్లద్ధాలు పెట్టుకుని నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉత్తరాది హీరోయిన్లను తీసుకొచ్చి మీ సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌ చేయిస్తున్నారు సిగ్గు అనిపించడం లేదా? మీరు చేసే సినిమాలు చిన్నపిల్లలు చూసే విధంగా ఉంటున్నాయా? పిల్లలున్నారని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని శ్రీరెడ్డి మండి పడ్డారు.

Similar News