టాలీవుడ్ లో క‌ల‌క‌లం..శ్రీరెడ్డి లీక్స్ తో ప్రముఖుల‌కు వ‌ణుకు

Update: 2018-03-27 10:04 GMT

టాలీవుడ్ లో శ్రీరెడ్డి లీక్స్ క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. న్యూస్ ప్ర‌జెంట‌ర్ , యాక్ట‌ర్ గా అంచెలంచెలుగా ఎదిగిన శ్రీరెడ్డి తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూతో వెలుగులోకి వ‌చ్చారు. కెరియ‌ర్ పీక్ లో ఉన్న‌ప్పుడు త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి వాపోయింది. అవ‌కాశాల‌పేరిట క‌మిట్మెంట్ కోసం పాకులాడే డైర‌క్ట‌ర్స్, ప్రొడ్యూస‌ర్స్ చాలా మందే ఉన్నారంటూ మండిప‌డింది.  త‌మ దాహాన్ని తీర్చుకునేందుకు అవ‌కాశాలు ఇప్పిస్తామంటూ వాడుకొన్న‌వారు చాలామందే ఉన్నారంటూ ఆరోపించింది. 
సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తానంటూ ఓ పెద్ద హీరో త‌మ్ముడు త‌న‌తో డేటింగ్ చేసిన‌ట్లు, తీరా అవ‌స‌రం తీరాకా వ‌దిలేశాడ‌ని , కానీ త‌న‌కెరియ‌ర్ కు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డలేద‌ని వాపోయింది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై ప‌లు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌స్తావించిన శ్రీరెడ్డి తాజాగా త‌మిళ‌నాట సుచీ లీక్స్ ఎంత పాపుల‌ర్ అయ్యాయో అదే త‌ర‌హా ఇండ‌స్ట్రీలు ఉన్న ప్ర‌ముఖులు తెర‌వెనుక బాగోతాల చిట్టా త‌న‌ద‌గ్గ‌ర ఉందంటూ హెచ్చరించింది. 
వాటిని అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వెలుగులోకి తెస్తాన‌ని చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా త‌న‌తో క్లోజ్ గా ఓ వ్య‌క్తి ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. లీక్ స్టార్టెడ్ అని కామెంట్ చేసిన శ్రీరెడ్డి లీక్ చేసిన వ్యక్తి ఫోటో అసంపూర్తిగా పెట్టింది. దీంతో ఆమెతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో వణుకు మొదలైందనే ప్రచారం జరుగుతున్నది. 
 వ్యక్తుల ముఖాల కనిపించకుండా తాజా లీక్స్ వ్యవహారం కేవలం పబ్లిసిటీ కోసమేనా? ఒకవేళ తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలనుకొంటే ఆయా వ్యక్తుల ముఖాలు కనిపించకుండా బయటపెట్టడం కాదు. తమిళనాట సెన్సేషన్ రేపిన సుచీలీక్స్ మాదిరిగా డైరెక్ట్‌గా ఫొటోలు బయటపెడితే శ్రీరెడ్డిని నమ్మడానికి వీలు ఉంటుంది అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
  

Similar News