ఈ సృష్టిలో అపురూపమైనది స్త్రీ... ఆమెకు మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది. అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం అనిర్వచనీయమైన ఆనందానికి చిరునామాగా నిలుస్తుంది. ప్రసవ వేదనను సైతం భరిస్తూ తన ప్రతిరూపానికి జన్మనిస్తున్న సంతోషం అమ్మతనపు సౌభాగ్యానికి అద్దం పడుతుంది. కానీ ప్రతీ ఒక్కరి జీవితంలోని మరే ఘట్టం కూడా మాతృత్వం తాలూకు మధురిమను పంచదనే సత్యం నిర్వివాదాంశం. అయితే ప్రస్తుత జనరేషన్ లో 30 దాటితే పిల్లలు పుట్టరు. తొందరగా పెళ్లిచేసుకుంటే మంచిదని సూచిస్తున్నవారికి ఈ అమ్మ గుణపాఠం చెప్పింది. శరీరానికే కానీ..అమ్మతనానికి వయస్సుతో సంబంధంలేదని నిరూపించింది. అండాశయ కాన్సర్ తో బాధపడుతున్న 101 సంవత్సరాల వయస్సులో తన 17వ పండంటి బిడ్డకు జన్మనిచ్చి అందరిచేత హౌరా అనిపించింది. ఇది కొంచం ఆశ్చర్యంగా ఉన్నా..ఇటలీకి చెందిన వెర్టడీలా టోలియా అనే బామ్మ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ బామ్మకు అండాశయ కాన్సర్ ఉంది. జబ్బుతో మొదట పిల్లల్ని కనడం కష్టంగా మారుతోందని డాక్టర్లను సంప్రదించింది. తనకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలని కోరింది. కానీ ప్రసవం సమయానికి కొంతమంది డాక్టర్ల పర్యవేక్షణలో ఎటువంటి ఆపరేషన్ లేకుండా బిడ్డకు జన్మించింది. మరో విశేషం ఏమిటంటే జన్మించిన ఫ్రాన్స్ సిస్కో అనారోగ్య సమస్యలు లేవని డాక్టర్లు తెలిపారు.