How To Check PF Balance: ఇప్పుడు చాలా ఈజీ.. PF బ్యాలెన్స్‌ని సింపుల్‌గా చెక్ చేయండి..!
How To Check PF Balance: మీ PF బ్యాలెన్స్‌ని ఎస్ఎమ్ఎస్, మిసిడ్ కాల్, ఉమాంగ్ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
How to check PF balance: మీరు మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారా? మీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేయడం చాలా సులభం. కానీ చాలా సందర్భాలలో ఖాతాదారులకు వారి PF అకౌంట్‌లో మొత్తాన్ని ఎలా తనిఖీ చేయాలో తెలియదు. ఈ రోజు మనం PF చెక్ చేయడానికి నాలుగు చాలా సులభమైన మార్గాలను తెలుసుకుందాం. వీటితో మీరు మీ పీఎఫ్ ఖాతా మొత్తాన్ని ఒక్క క్షణంలో తెలుసుకోవచ్చు.
SMS
7738299899 నంబర్‌కు SMS పంపడం ద్వారా మీరు మీ EPF ఖాతా బ్యాలెన్స్, మీ ఖాతాలో తాజా సహకారాన్ని కూడా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు రిజిస్టర్డ్ నంబర్ నుండి AN EPFOHO ENG అని టైప్ చేసి SMS పంపాలి. ఇక్కడ ENG ఆంగ్లాన్ని సూచిస్తుంది. మీరు వేరే భాషలో తెలుసుకోవాలనుకుంటే, ఆ భాషలోని మొదటి మూడు అక్షరాలను టైప్ చేయండి.
Missed Call
మీ మొబైల్ నంబర్ UANతో రిజిస్టర్ అయినట్లయితే మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425కు మిస్డ్ కాల్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ చేసిన తర్వాత మీకు EPFO నుండి కొన్ని మెసేజెస్ వస్తాయి. అందులో మీ PF ఖాతాల బ్యాలెన్స్ మీకు కనిపిస్తుంది.
Umang App
మీరు ఉమంగ్ యాప్ ద్వారా కూడా మీ PF బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. పౌరులకు ఒకే చోట వివిధ ప్రభుత్వ సేవలను పొందేందుకు ప్రభుత్వం ఉమంగ్ యాప్‌ను విడుదల చేసింది. మీరు ఉమాంగ్ యాప్‌ని ఉపయోగించి క్లెయిమ్‌లను సడ్‌మిట్ చేయవచ్చు. మీ EPF పాస్‌బుక్‌ని చూడొచ్చు. మీ క్లెయిమ్‌లను ట్రాక్ చేయవచ్చు. దీని కోసం మీరు యాప్‌లో మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేసి, వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
EPFO Portal
EPFO వెబ్‌సైట్‌కి వెళ్లి ఉద్యోగుల సెక్షన్‌పై క్లిక్ చేసి, ఆపై మెంంబర్ పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి. మీ UAN, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా మీరు PF పాస్‌బుక్‌ని యాక్సెస్ చేయవచ్చు. ఇందులో ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్‌తో పాటు ఉద్యోగి, యజమాని సహకారం కనిపిస్తుంది. ఏదైనా PF బదిలీ మొత్తం, పొందిన PF వడ్డీ మొత్తం కూడా కనిపిస్తుంది. ఈపీఎఫ్ బ్యాలెన్స్ పాస్ బుక్‌లో కూడా చూడవచ్చు.