Stock Market: భారత మార్కెట్లలో వరుసగా మూడోవారం ర్యాలీ
Stock Market: సెన్సెక్స్ 677.17 పాయింట్లు పెరిగి 52,100వద్ద క్లోజ్ *నిఫ్టీ 234 పాయింట్ల మేర లాభంతో 15,670 వద్ద స్థిరం
Stock Market: భారత మార్కెట్లలో వరుసగా మూడోవారం ర్యాలీ కొనసాగింది...గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు కీలక వడ్డీ రేట్లను యథాతధంగా కొనసాగిస్తూ ఆర్‌బీఐ ప్రకటన, యుఎస్ వ్యవసాయేతర పేరోల్ డేటా గణాంకాలు,వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకున్న దరిమిలా కోవిడ్ కొత్త కేసులు గణనీయంగా తగ్గిపోవడం తదితర అంశాలు మార్కెట్ పై పాజిటివ్ ప్రభావాన్ని చూపాయి..తాజా వారంలో బెంచ్ మార్క్ సూచీలు సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి.
తాజా వారంలో బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ బిఎస్‌ఇ సెన్సెక్స్ 677.17 పాయింట్లు పెరిగి 52,100వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 234 పాయింట్ల మేర లాభంతో 15,670 వద్దకు చేరుకుంది. నిఫ్టీ తాజా రికార్డు స్థాయి 15,733 పాయింట్లను తాకింది, సెన్సెక్స్ కూడా తాజా వారంలో రికార్డు స్థాయి 52,516 పాయింట్ల వద్దకు చేరుకుంది.
ప్రస్తుత వారంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 5,462.20 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు801.95 కోట్ల రూపాయల ఈక్విటీలను విక్రయించినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.. కాగా దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతాన నష్టాలతో ముగిసినప్పటికీ..రానున్న వారంలో సూచీల ర్యాలీ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.