Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: వరుసగా 4 రోజులపాటూ మొత్తం రూ.600 పెరిగిన బంగారం ధర నిన్న మాత్రం రూ.110 మాత్రమే తగ్గింది.
Gold Rate Today: గత కొద్ది రోజులు ఆల్ టైం హై కి వెళ్లిన పసిడి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.48,160కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 క్షీణితతో రూ.44,150కు తగ్గింది. వెండి ధర కేజీకి రూ.600 తగ్గుదలతో రూ.73,600కు క్షీణించింది. వరుసగా 4 రోజులపాటూ మొత్తం రూ.600 పెరిగిన బంగారం ధర నిన్న కొద్దిమేర రూ.110 మాత్రమే తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.01 శాతం పెరుగుదలతో 1778 డాలర్లకు చేరింది. బంగారం ధర పైకి కదిలితే వెండి రేటు మాత్రం తగ్గింది. ఔన్స్‌కు 0.04 శాతం క్షీణతతో 25.83 డాలర్లకు తగ్గింది.
వెండి ధరలు...
హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పడిపోయింది. బంగారం బాటలోన వెండి ధరలు కొనసాగాయి. వెండి ధరలు నిన్న కొద్దిగా తగ్గినా గత 20 రోజుల్లో వెండి ధర కేజీకి రూ.6,300 పెరిగింది. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.73,600 ఉంది. నిన్న ధర రూ.600 తగ్గింది. 8 గ్రాములు (తులం) కావాలంటే దాని ధర రూ.588.80 ఉంది. నిన్న ధర రూ.4.80 తగ్గింది. ఒక్క గ్రాము వెండి ధర రూ.73.60 ఉంది. గత 6 నెలలతో పోల్చితే... అప్పుడప్పుడూ తగ్గుతూ ఉన్నా... ఓవరాల్‌గా వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 6 నెలల కిందట అక్టోబర్ 14న వెండి ధర కేజీ రూ.62,000 ఉంది. ఇప్పుడు రూ.73,600 ఉంది. అంటే రూ.11,600 పెరిగింది
గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 21-04-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.