Interest Rates: వడ్డీరేట్లని పెంచిన 4 ఫేమస్ బ్యాంకులు.. తాజా రేట్లు తెలుసుకోండి..!
Interest Rates: వడ్డీరేట్లని పెంచిన 4 ఫేమస్ బ్యాంకులు.. తాజా రేట్లు తెలుసుకోండి..!
Interest Rates: రెపో రేటు పెరగడంతో ప్రతిరోజూ ఏదో ఒక బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేటును పెంచుతోంది. తాజాగా నాలుగు ఫేమస్ బ్యాంకులు FD రేట్లని పెంచాయి. ఈ బ్యాంకుల్లో కరూర్ వైశ్యా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ ఉన్నాయి. ఈ నాలుగు బ్యాంకులు రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటును పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజా రేట్ల గురించి తెలుసుకుందాం.
1. కరూర్ వైశ్యా బ్యాంక్
కరూర్ వైశ్యా బ్యాంక్ 7 నుంచి 30 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై 4% వడ్డీని అందిస్తోంది. 31 రోజుల నుంచి 45 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 5.25 శాతం వడ్డీ, 46 నుంచి 90 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 5.25 శాతం వడ్డీ ఇస్తోంది. అదేవిధంగా 91 నుంచి 120 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలపై 5.5% వడ్డీని ఇస్తోంది. 120 నుంచి 180 రోజుల FDలపై వడ్డీ రేటు 5.50 శాతం ఇస్తోంది. అలాగే 181 రోజుల నుంచి 270 రోజుల ఎఫ్‌డిపై 5.75 శాతం వడ్డీ, 181 నుంచి 270 రోజుల ఎఫ్‌డిపై 5.90 శాతం వడ్డీ ఇస్తోంది. ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్‌డీలపై 6.10 శాతం, 2 నుంచి 3 ఏళ్ల ఎఫ్‌డీలపై అదే వడ్డీని అందజేస్తున్నారు. కొత్త రేట్లు సెప్టెంబర్ 1, 2022 నుంచి వర్తిస్తాయి.
2. కోటక్ మహీంద్రా బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంక్ 390 రోజుల నుంచి 23 నెలల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై 6% వడ్డీని అందిస్తోంది. కొత్త రేట్లు సెప్టెంబర్ 6, 2022 నుంచి వర్తిస్తాయి. 23 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు ఎఫ్‌డిలపై 6.10 శాతం వడ్డీ, 2 నుంచి 10 ఏళ్ల ఎఫ్‌డీలపై 6 శాతం, 23 నెలల నుంచి రెండేళ్ల లోపు ఎఫ్‌డీలపై 6.10 శాతం వడ్డీ ఇస్తోంది. అలాగే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు FDలపై 6% వడ్డీ, 3 సంవత్సరాల కంటే ఎక్కువ కానీ 4 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న FDలపై 6 శాతం, 4 సంవత్సరాల కంటే ఎక్కువ కానీ 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న FDలపై 6 శాతం వడ్డీ లభిస్తుంది.
3. సిటీ యూనియన్ బ్యాంక్
సిటీ యూనియన్ బ్యాంక్ 2 కోట్ల కంటే తక్కువ FDలపై వడ్డీ రేట్లను మార్చింది. సాధారణ కస్టమర్లకు 4 నుంచి 6 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లు 4 నుంచి 6.25 శాతం వరకు వడ్డీని పొందుతున్నారు. కొత్త రేట్లు సెప్టెంబర్ 1, 2022 నుంచి వర్తిస్తాయి. 400 రోజుల FDలపై 5.60 శాతం, 700 రోజుల FDలపై 5.75 శాతం, 3 సంవత్సరాల కంటే ఎక్కువ, 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న FDలపై 5.75 శాతం, పన్ను ఆదా చేసే FDలపై 6% వడ్డీ అందుబాటులో ఉంటుంది.
4. కర్ణాటక బ్యాంక్
కర్ణాటక బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే FDలపై కొత్త వడ్డీ రేటు 6.20 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.60 శాతం, కొత్త రేట్లు సెప్టెంబర్ 1, 2022 నుంచి వర్తిస్తాయి. ఒక సంవత్సరం FDపై 5.20 శాతం వడ్డీ, ఒక సంవత్సరం కంటే ఎక్కువ, 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాటిపై 5.50 శాతం, 2 నుంచి 5 సంవత్సరాల FDలపై 5.65 శాతం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై 5.70 శాతం ఇస్తోంది.