ఈ కంపెనీ ఉద్యోగులకి బంపర్ ఆఫర్.. ఒకేసారి రెండు వేతనాలు..!
Moonlighting Policy: దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ కంపెనీ స్విగ్గీ ఇప్పుడు ఉద్యోగులకు పెద్ద సౌకర్యాన్ని కల్పిస్తోంది.
Moonlighting Policy: దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ కంపెనీ స్విగ్గీ ఇప్పుడు ఉద్యోగులకు పెద్ద సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇది ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుంది. స్వీగ్గీ 'మూన్‌లైటింగ్' పాలసీని ప్రవేశపెట్టింది. దీని కింద మీరు రెండు కార్యాలయాల్లో పని చేసే అవకాశం పొందుతారు. పరిశ్రమలో తొలిసారిగా 'మూన్‌లైటింగ్' పాలసీని తీసుకురాబోతున్నట్లు స్విగ్గీ సంస్థ ప్రకటించింది. దీని కింద ఉద్యోగులు ఇతర పని చేసుకోవచ్చు.
ఉద్యోగులకి మరింత ఆర్థిక ప్రయోజనాలని అందించేందుకు కంపెనీ ఈ పాలసీని రూపొందించింది. ఈ విధానం ప్రకారం కంపెనీ తన ఉద్యోగులను మరొక పని చేయడానికి అనుమతిస్తుంది. వారు ఇప్పటికే ఉన్న కంపెనీ నిర్దిష్ట నిబంధనలు, షరతులకు లోబడి వారి ప్రాథమిక ఉద్యోగం పని గంటలతో పాటు రెండో ఉద్యోగాన్ని కూడా చేసుకోవచ్చు. అంటే ఒకరు ఏకకాలంలో రెండు ఉద్యోగాల ప్రయోజనాన్ని పొందే అవకాశం కల్పిస్తోంది.
దీని గురించి సమాచారం ఇస్తూ స్విగ్గీ ఇలా చెప్పింది.. 'ఈ పాలసీలో ఆఫీసు తర్వాత లేదా వారపు సెలవుల్లో చేసే పనులు ఉంటాయి. ఇలాంటి ఉద్యోగాలు వారి ఆర్థిక భద్రతకి సహాయం చేస్తాయి. ఏ వ్యక్తికైనా ఇటువంటి అభివృద్ధికి ప్రాజెక్ట్‌లు గణనీయంగా దోహదపడతాయని స్వీగ్గీ సూచించింది. దీనికి ఇంతకు ముందే ఉద్యోగులకు అనేక సౌకర్యాలను కల్పించిన సంగతి తెలిసిందే. స్వీగ్గీ ఉద్యోగులు కార్యాలయానికి రావలసిన అవసరాన్ని తొలగించి ఎక్కడి నుంచైనా పని చేసుకొనే సౌకర్యాన్ని కల్పించింది.