State Bank of India: పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్.. ఈ ఎస్‌బీఐ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే.. డబ్బు రెట్టింపు అవ్వాల్సిందే..!
State Bank of India FD: ఎస్‌బీఐ... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI FD Scheme) ద్వారా కస్టమర్ల కోసం అనేక పథకాలు అమలు చేయబడుతున్నాయి. ఈ సమయంలో పెట్టుబడికి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉత్తమ ఎంపిక. ఇందులో మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు.
State Bank of India FD: ఎస్‌బీఐ... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ ఎఫ్‌డీ స్కీమ్) ద్వారా కస్టమర్ల కోసం అనేక పథకాలు అమలు చేయబడుతున్నాయి. ఈ సమయంలో పెట్టుబడికి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉత్తమ ఎంపిక. ఇందులో మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. SBI నుంచి, కస్టమర్‌లు వివిధ కాల వ్యవధిలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఎంపికను పొందుతారు. బ్యాంక్ నుంచి, కస్టమర్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు FD సౌకర్యాన్ని పొందుతారు.
SBI వివిధ మెచ్యూరిటీ కాలాలకు FD సదుపాయాన్ని అందజేస్తోంది. బ్యాంకు ఖాతాదారులకు 3 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. ఇది కాకుండా, సీనియర్ సిటిజన్స్ బ్యాంక్ 3.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ ప్రయోజనాలను అందిస్తోంది.
1 లక్ష 2 లక్షలు అవుతుంది..
మీరు 10 సంవత్సరాల మెచ్యూరిటీ కోసం SBIలో ఏక మొత్తంలో రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే, మీ డబ్బు రెట్టింపు అవుతుంది. SBI FD కాలిక్యులేటర్ ప్రకారం, పెట్టుబడిదారులు 6.5 శాతం వడ్డీతో రూ. 90,555 లక్షలు పొందుతారు. పెట్టుబడిదారులు 10 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీపై రూ.90,555 పొందుతారు.
సీనియర్ సిటిజన్లు రూ.2,10,234 పొందుతారు..
ఇది కాకుండా, సీనియర్ సిటిజన్లు 7.5 శాతం వడ్డీని పొందుతున్నారు. ఒక సీనియర్ సిటిజన్ 10 సంవత్సరాల మెచ్యూరిటీ కోసం FD చేస్తే, వారి డబ్బు రెట్టింపు అవుతుంది. మీరు 10 సంవత్సరాల FDలో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, మీరు మెచ్యూరిటీపై రూ. 2,10,234 పొందుతారు. ఇందులో వడ్డీ ద్వారా రూ.1,10,234 స్థిర ఆదాయం ఉంటుంది.