New Year 2020 : కొద్ది గంటల్లో పని పూర్తి చేయకపోతే రూ.10,000 జరిమానా..

Update: 2019-12-31 07:45 GMT
ప్రతీకాత్మక చిత్రం

పాత సంవత్సంరానికి విడ్కోలు చెప్పడానికి ఇంకా కొద్ది గంటలు మాత్రమే సమయం మిగిలింది. ఇంకా ఒక్క రోజు గడిస్తే చాలు నూతన ఏడాదిని వదిలి కొత్త ఏడాదిలోకి అడుగు పెడతాం. అయినా కొంత మంది డిసెంబర్ 31వరకు పూర్తి చేసుకోవలసిన ముఖ్యమైన పనిని పూర్తి చేసుకోకుండానే మిగిలిపోయారు. ఆ పనిని అలాగే వదిలేస్తే కొత్త సంవత్సరంలో మీ జేబుకు చిల్లు పడినట్టే. ఈ కొన్ని గంటల్లోనే ఆ పనిని పూర్తి చేసుకుని రూ.5,000 ఆదా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పనిని పూర్తి చేసుకోండి. అయితే ఇది అందరికీ కాదు. కేవలం కొందరికి మాత్రమే వర్తిస్తుంది. ఇక ఈ పనిని నెగ్ లెట్ చేసారో వారు కొత్త సంవత్సరంలో రూ.10,000 జరిమానా చెల్లించక తప్పదు.

ఇక సంవత్సరాంతంలో పూర్తి చేయవలసిన పని ఏంటి అనుకుంటున్నారా. పూర్తి వివరాల్లోకెళితే 2019-20 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలుకు 2019 ఆగస్ట్ 31తో గడువు పూర్తియ్యిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కొంత మంది ఆగస్ట్ 31లోపు ఈ ఐటీఆర్ దాఖలు చేసుకోలేదు. వారి కోసం ఆదాయపు పన్ను శాఖ కొంత మేరకు జరిమానాతో కట్టుకునేందుకు డిసెంబర్ 31, 2019 వరకు గడువును పొడిగించింది. ఇక ఈ గడువు ముగియడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఈ కొద్ది సమయంలో నైనా వారు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఏకంగా రూ.10,000 పెనాల్టీ కట్టవలసి వస్తుంది. ఇక ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ట్యాక్సబుల్ ఇన్‌కమ్ కలిగిన వారు కచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేయాల్సిందే. ఈ ట్యాక్స్ కు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ప్రకారం ఐటీఆర్ దాఖలు చేయాలి. నిర్ణీత గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ ఎంత పెనాల్టీలు వేస్తే అంత చెల్లించాల్సిందే. ఇక ఇప్పటివరకూ ఐటీఆర్ దాఖలు చేసుకోనివారు ఇప్పుడే వెళ్లి దాఖలు చేసుకోండి. నూతన సంవత్సరంలో మీ డబ్బును కాపాడుకోండి.


Tags:    

Similar News