పరుగులు తీస్తున్న పెట్రోల్ ధరలు.. యధాతథంగా డీజిల్!

పెట్రోల్ ధరలు పైపైకే కదులుతున్నాయి. మరోవైపు డీజిలు ధరలు మాత్రం నిలకడగా ఉంటున్నాయి.

Update: 2019-11-26 03:19 GMT
Today's Petrol rates: Representationl Image

గత ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్నపెట్రోల్ ధరలు ఈరోజు (26-11-2019) కూడా పెరిగాయి. ముంబై లో లీటరు పెట్రోల్ 80 రూపాయలను దాటింది. ఇక హైదరాబాద్ లోనూ 80 రూపాయలకు చెరువులోకి దూసుకుపోతోంది. మరో వైపు డీజిలు ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. 

హైదరాబాద్ లో నిన్నటి ధరలతో పోలిస్తే లీటరు పెట్రోల్ ధర 11 పైసలు పెరిగి 79.12 రూపాయలకు చేరుకుంది. ఇక డీజిలు ధరలో మాతరం మార్పు లేకుండా 71.04 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడలో పెట్రోల్ ధర 10 పైసలు పెరిగి 78.75 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 70.70 రూపాయలుగానూ ఉన్నాయి. అమరావతి లోనూ పెట్రోల్ ధర 10 పైసలు పెరిగి 79.12 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 70.04 రూపాయలుగానూ ఉన్నాయి.

ఇక ఢిల్లీలోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. డీజిలు ధరల్లో మాత్రం మార్పు లేదు. ఇక్కడ పెట్రోల్ ధర 10 పైసలు పెరిగి 74.76 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 65.73 రూపాయలుగానూ ఉన్నాయి. అటు వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు లీటరుకు 80 రూపాయలు దాటేసి పరుగులు తీస్తున్నాయి. ఇక్కడా పెట్రోల్ ధర 10 పైసలు పెరిగి 80.42 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 68.94 రూపాయలుగానూ ఉన్నాయి.


Tags:    

Similar News