Petrol Price: వాహనదారులకు బిగ్ షాక్.. ఆల్‌టైం హైకి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

వాహనదారులకు బ్యాడ్ న్యూస్ .. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ పెరిగాయి.

Update: 2021-01-28 10:32 GMT

వాహనదారులకు బ్యాడ్ న్యూస్ .. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ పెరిగాయి. పెట్రోల్ ధరలు వంద మార్క్ చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి సెంచరీ కొట్టింది. రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో పెట్రోల్ ధర లీటర్ పైన ఏకంగా రూ.101.15 చేరింది. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ధరలు పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచాయి. జనవరి 6వ తేదీ నుండి చమురు ధరలు పలుమార్లు పెరిగిన విషయం తెలిసిందే.

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు బుధవారం 100 రూపాయలు దాటింది. ఇక్కడ ప్రీమియం పెట్రోల్ కావాలంటే రూ.101.15గా ఉంది. సాధారణ పెట్రోల్ రూ.98.40గా ఉంది.ఢిల్లీలో బ్రాండెడ్ పెట్రోల్ లీటర్ రూ.89.10, ముంబైలో రూ.95.61గా ఉంది. ఇతర ప్రధాన నగరాల్లోను పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. 

దేశయ చమురు రంగ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ BPCL ,ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ IOC ,హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL)లు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలు సవరిస్తున్నాయి. దేశీయ చమురు రంగ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సవరిస్తాయి. 

Tags:    

Similar News