దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరల పెంపు కొనసాగుతోంది. వరుసగా పదో రోజు ఇంధన ధరలు పెరగడంతో సరికొత్త గరిష్ఠాలను తాకాయి. దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలో తొలిసారిగా లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయల మార్క్ కు చేరువ కాగా ముంబై లో 96 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. దేశవ్యాప్తంగా పెట్రోలుపై 35 , డీజిల్‌పై 32 నుంచి 34 పైసల మేర ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 89 రూపాయల 88 పైసలు, డీజిల్ 80 రూపాయల 27 పైసలు వద్దకు చేరాయి. ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 96 రూపాయల మార్క్ ఎగువకు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 93 రూపాయల 10 పైసలు, డీజిల్ 87 రూపాయల 20 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.