Pension Scheme: ఇకపై పెళ్లికాని వారికి పెన్షన్.. ఎక్కడో కాదండోయ్.. మనదేశంలోనే.. ఎంతో తెలుసా?
Pension Scheme For Unmarried: త్వరలో పెళ్లికాని వారికి కూడా పెన్షన్ అందనుంది. అవును.. అదెక్కడో కాదు. మనదేశంలోనే.. పెళ్లికాని ప్రసాదులకు ఇకపై పెన్షన్ ఇవ్వాలని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటించడం గమనార్హం.
Pension Scheme For Unmarried: త్వరలో పెళ్లికాని వారికి కూడా పెన్షన్ అందనుంది. అవును.. అదెక్కడో కాదు. మనదేశంలోనే.. పెళ్లికాని ప్రసాదులకు ఇకపై పెన్షన్ ఇవ్వాలని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటించడం గమనార్హం. హర్యానాలో ఇకపై పెళ్లికాని వారికి పెన్షన్ లభించనుంది. ప్రజా సంవాద కార్యక్రమంలో 60 ఏళ్ల అవివాహిత వృద్ధుల డిమాండ్‌పై సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల అవివాహిత పురుషులు, మహిళలు దీని ప్రయోజనం పొందనున్నారు.
వార్షిక ఆదాయం రూ.1.80 లక్షల కంటే తక్కువ ఉన్న బ్యాచిలర్లకు మాత్రమే పెన్షన్ ఇవ్వనున్నారు. సీఎం కార్యాలయం రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 1.25 లక్షల మంది అవివాహితులు ఈ పథకం ద్వారా పింఛను పొందనున్నారు.
దీనిపై ఇప్పటికే సీఎం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ పథకాన్ని నెల రోజుల్లో అమలు చేసేందుకు హర్యానా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం అమలులోకి వచ్చిన తీసుకొస్తే.. ఇలాంటి పథకం అమలుచేస్తోన్న తొలి రాష్ట్రంగా హర్యానా అవతరిస్తుంది.
2750 రూపాయలు పింఛను..
హర్యానాలో వృద్ధాప్య, వితంతువు, వికలాంగుల పెన్షన్ ఇప్పటికే అందిస్తున్నారు. హర్యానా ప్రభుత్వం మరుగుజ్జు వ్యక్తులు, నపుంసకులకు ఆర్థిక సహాయం చేస్తుంది. దీంతో పాటు కేవలం ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోతే 45 నుంచి 60 ఏళ్ల వరకు రూ.2,750 ఆర్థిక సహాయం అందజేస్తారు. పెళ్లికాని వారికి కూడా ప్రభుత్వం రూ.2,750 పెన్షన్ ఇవ్వవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
10 సంవత్సరాలలో 38 పాయింట్లకు చేరిన లింగ నిష్పత్తి..
హర్యానాలో బ్యాచిలర్లకు పెన్షన్ ప్రవేశపెట్టడం కూడా ఇక్కడ దిగజారుతున్న లింగ నిష్పత్తితో ముడిపడి ఉంది. హర్యానా లింగ నిష్పత్తి గత 10 ఏళ్లలో 38 పాయింట్లు మెరుగుపడింది. 2011లో రాష్ట్రంలో లింగ నిష్పత్తి 879 ఉండగా, ఇప్పుడు 2023 నాటికి ప్రతి 1000 మంది అబ్బాయిలకు 917 మంది బాలికల సంఖ్య పెరిగింది.