ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్..

రిజర్వు బ్యాంక్ ఖాతాదారులకు ఒక కమ్మటి వార్తను అందించింది. ఇప్పటి వరరూ కేవలం 12 గంటలు మాత్రమే పనిచేసిన నెఫ్ట్ లావాదేవీ సేవల సమయాన్ని పొడిగించింది.

Update: 2019-12-08 10:02 GMT
ఆర్ బీ ఐ

రిజర్వు బ్యాంక్ ఖాతాదారులకు ఒక కమ్మటి వార్తను అందించింది. ఇప్పటి వరరూ కేవలం 12 గంటలు మాత్రమే పనిచేసిన నెఫ్ట్ లావాదేవీ సేవల సమయాన్ని పొడిగించింది. 24 గంటల పాటు ఏ సమయంలో నైనా ఈ సేవల ద్వారా లావాదేవీలను చేసుకోవచ్చని రిజర్వు బ్యాంక్ తెలిపింది.

ఈ నెల అంటే డిసెంబర్ 16వ తేది 00:30 తర్వాత రిజర్వు బ్యాంక్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకూ ఈ సేవలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉండేది. కానీ ఈ కొత్త ప్రణాళిక ద్వారా ఇప్పుడు 24 గంటల పాటు ఈ సర్వీసు వినియోగంలో ఉంది.

దీంతో ఖాతాదారుల లావాదేవీ వీలైనంత త్వరగా సెటిల్ అవుతాయని రిజర్వు బ్యాంక్ వెల్లడి చేసింది. ఒకవేళ ఈ ట్రాన్ జక్షన్ ద్వారా ఖాతాలో డబ్బులు జమ కాకపోయినట్లయితే 2 గంటల్లోగా రిటర్న్ అవుతాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. పేమెంట్స్ సెటిల్‌ మెంట్ విజన్ 2019-21లో భాగంగా ఆర్బీఐ మొదటిసారిగా నెఫ్ట్, ఆర్టీజిస్ సేవలను ఉచితంగా 24 గంటలపాటు కస్టమర్లు వినియోగించుకునేందుకు ఆర్బీఐ ఈ సేవలను వినియోగదారుల ముందుకు తీసుకువస్తుంది.

అంతే కాకుండా సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్- NEFT లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకులకి ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు 2020 జనవరి నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ తెలిపింది.  


Tags:    

Similar News