Maruti Suzuki: గత నెలతో పోలిస్తే 277% పెరిగిన అమ్మకాలు

Update: 2021-07-12 11:47 GMT

మారుతి ఏర్టిగా (ఫైల్ ఫోటో)

Maruti Suzuki: భారత వాహనాల తయారీలో అగ్రగామిగా దూసుకుపోతున్న మారుతి సుజుకి అటు వాహనాల తయారితో పాటు అమ్మకల్లోనూ మిగిలిన కంపెనీల కన్నా అత్యధిక సేల్స్ తో ఈ ఏడాది ముందుంది. తాజాగా గత నెల మేతో పోలిస్తే జూన్ నెలలో మారుతి సుజుకి కంపెనీ అమ్మకాలు ఏకంగా 277% పెరిగాయి. అదే విధంగా గత ఏడాది తో పోలిస్తే 142%తో మారుతి సుజుకి మంచి సేల్స్ సాధించింది. ఇటీవలే మారుతి సుజుకిలో మారుతి ఏర్టిగా 7 సీటర్స్ తో విడుదలైన కొత్త మోడల్ కార్లలో డీజిల్ ను బ్యాన్ చేసి కేవలం పెట్రోల్ మరియు సిఎన్జీ వేరియంట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

ఇప్పటికే ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ+ నాలుగు మోడల్స్ లో రిలీజ్ అయిన ఈ కార్ ఆటోమేటిక్ వేరియంట్ లో 18 కిలోమీటర్లు, మ్యానువల్ వేరియంట్ లో 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని మారుతి సుజుకి యాజమాన్యం తెలిపింది. ఇక గత ఆరు నెలలుగా స్విఫ్ట్ కారుతో పాటు బలెనో వాహనాలకు గట్టి పోటీ ఇస్తున్న మారుతి ఏర్టిగా జూన్ నెలలో 9,920 యూనిట్ల అమ్మకంతో గత ఏడాది కంటే 200 శాతం ఎక్కువ అమ్మకాలు చేసింది. ఇక స్విఫ్ట్ 1.72 లక్షల యూనిట్లతో ముందుంటే బలేనో 1.63 లక్షల యునిట్లతో ద్వితీయ స్థానంలో ఉంది. ఇక మరో కంపెనీ ఫోర్డ్, టొయోటా గత నెల కంటే ఈ నెలలో మంచి సేల్స్ సాధించిన మొత్తం మార్కెట్ షేర్ లో మాత్రం 48.7% తో ఉన్న మారుతి సుజుకి సేల్స్ ని మాత్రం అందుకోలేకపోయాయి.

Tags:    

Similar News