ఎల్‌ఐసీ సరికొత్త పాలసీ.. బెనిఫిట్స్, ప్రీమియం చెల్లింపు సూపర్..!
LIC Bima Ratna: ఎల్‌ఐసీ భారతదేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ. దేశంలోని ప్రతి వర్గాలకి ఇన్సూరెన్స్ పాలసీలని అందిస్తుంది.
LIC Bima Ratna: ఎల్ఐసీ భారతదేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ. దేశంలోని ప్రతి వర్గాలకి ఇన్సూరెన్స్ పాలసీలని అందిస్తుంది. రిస్క్ లేని పెట్టుబడిని ఇష్టపడే పెట్టుబడిదారులు ఎల్‌ఐసిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతారు. ఎల్‌ఐసీ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు గొప్ప పథకాలను ప్రవేశపెడుతుంది. అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకొని వారికోసం పాలసీలని రూపొందిస్తుంది. తాజాగా ఎల్‌ఐసీ బీమా రత్న పేరుతో సరికొత్త పాలసీని ప్రవేశ పెట్టింది. ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎల్ఐసీ బీమా రత్న పాలసీ నాన్-లింక్డ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్ లైఫ్ ఇన్సురెన్స్ ప్లాన్. భద్రత, పొదుపుల కలయికతో వస్తుంది. ఈ పాలసీతో 15 ఏళ్లలోనే మీ డబ్బు తిరిగి పొందవచ్చు. ఎల్ఐసీ బీమా రత్న పాలసీదారుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాని అందిస్తుంది. అనుకోకుండా పాలసీదారుడు పాలసీ కాలవ్యవధిలో చనిపోతే కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా డబ్బు నామినీకి అందేటట్లుగా ఈ పాలసీని రూపొందించారు. ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంటుంది.
పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే మీ మొత్తాన్ని 'గ్యారెంటీ అడిషన్స్'తో పాటు నామినీకి అందజేస్తారు. బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు 125 శాతం లేదా వార్షిక ప్రీమియంకు 7 రెట్లు హామీ మొత్తం లో అధికంగా ఉన్న మొత్తం చెల్లిస్తారు. ఇక రిస్క్ పిరియడ్లో ఉండగా మరణిస్తే ప్రీమియంను తిరిగిచెల్లిస్తారు. మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్ మొత్తం ఒకేసారి కాకుండా ఐదేళ్లు వాయిదాల పద్ధతిలో తీసుకోవచ్చు.
పాలసీ కాలవ్యవధిలో పాలసీదారుడు జీవించి ఉంటేప్రాథమిక హామీ మొత్తంలో నిర్ణీత శాతం క్రమమైన పధ్ధతిలో పాలసీ నిబంధనలకు లోబడి చెల్లిస్తారు.15 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే.. పాలసీ తీసుకున్న 13, 14వ సంవత్సరాల్లో బేసిక్ హామీ మొత్తంలో 25 శాతం చొప్పున చెల్లిస్తారు. 20 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే.. పాలసీ తీసుకున్న 18, 19 సంవత్సరాలలో బేసిక్ హామీ మొత్తంలో 25 శాతం చొప్పున చెల్లిస్తారు. 25 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే పాలసీ తీసుకున్న 23, 24 సంవత్సరాలలో బేసిక్ హామీ మొత్తంలో 25 శాతం చొప్పున పాలసీదారునికి చెల్లిస్తారు.
90 రోజుల పిల్లల దగ్గర నుంచి 55 ఏళ్ల పెద్దవారి వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. 15 ఏళ్ల పాలసీకి కనీస వయసు.. 5 ఏళ్లు నిండి ఉండాలి. 20 ఏళ్ల పాలసీకి కనీస వయసు.. 90 రోజులు నిండి ఉండాలి. 25 ఏళ్ల పాలసీకి కనీస వయసు.. 90 రోజులు నిండి ఉండాలి. ఈ పాలసీ ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు.
Also Read
LIC Policy: ప్రతిరోజు 150 రూపాయలు పొదుపు చేయండి.. మీ పిల్లలని ఉద్యోగం రాకముందే ధనవంతులని చేయండి..!