పిల్లల కోసం ఎల్ఐసీ అద్బుత పాలసీ.. భవిష్యత్ ఖర్చులన్ని భరిస్తుంది..!

LIC Jeevan Tarun Policy: దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఎంతో మందికి చేయూతనిస్తుంది.

Update: 2022-01-28 10:06 GMT

పిల్లల కోసం ఎల్ఐసీ అద్బుత పాలసీ.. భవిష్యత్ ఖర్చులన్ని భరిస్తుంది..!

LIC Jeevan Tarun Policy: దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఎంతో మందికి చేయూతనిస్తుంది. ఇన్సూరెన్స్ చేయడం వల్ల చాలా కుటుంబాలకు ఆర్థిక భద్రతని కల్పిస్తుంది. అందుకే కోట్లమంది పాలసీదారులను కలిగి ఉంది. అయితే ఎల్ఐసీ పిల్లల భవిష్యత్ కోసం కూడా ప్రత్యేక పాలసీని రూపొందించింది. తక్కువ వయసులో, తక్కువ మొత్తంతో ఎక్కువ రాబడి అందించే విధంగా రూపొందించింది. ఈ పాలసీ పేరు ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీ. ఇది ఒక నాన్-లింక్డ్ పాలసీ అంటే షేర్ మార్కెట్కి సంబంధించిన ప్లాన్ కాదు.

ఇది పరిమిత ప్రీమియం పాలసీ. అంటే పాలసీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో దానికంటే 5 సంవత్సరాలు తక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది మనీ బ్యాక్ పాలసీ కూడా. దీనిలో పాలసీ డబ్బులో కొంత భాగం పిల్లల యుక్తవయస్సులో చెల్లిస్తారు. పిల్లలు 20 ఏళ్లు వచ్చినప్పుడు 4 సంవత్సరాలు కొంత అమౌంట్ ఇస్తారు. ఈ వయస్సులో పిల్లలకు ఉన్నత విద్య కోసం ఎక్కువ డబ్బు అవసరం కావొచ్చు. అందుకే మనీ బ్యాక్ ఆప్షన్ ఏర్పాటు చేశారు.

పిల్లల వయస్సు 25 ఏళ్లకు చేరుకున్నప్పుడు పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. అప్పుడు మొత్తంతో పాటు బోనస్ ఇస్తారు. పిల్లలు 90 రోజుల నుంచి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ప్లాన్ అందుబాటులో లేదు. మీరు ఈ పాలసీని 10 సంవత్సరాల పిల్లల కోసం తీసుకుంటున్నారని అనుకుంటే అప్పుడు పాలసీ వ్యవధి 15 సంవత్సరాలు. అత్యంత ముఖ్యమైనది దాని ప్రీమియం చెల్లింపు వ్యవధి. పాలసీ అమలులో ఉన్న సంవత్సరాల కంటే 5 సంవత్సరాలు తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

ఈ పాలసీని కనీస హామీ మొత్తం రూ. 75,000. గరిష్ట పరిమితి లేదు. దీన్ని ఒక ఉదాహరణతో చూస్తే బిడ్డ పుట్టిన మొదటి సంవత్సరంలో పాలసీ తీసుకుంటే పాలసీ వ్యవధి 25 సంవత్సరాలు. దీని ప్రకారం పిల్లల కుటుంబ సభ్యులు 20 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. 10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ సొమ్ము ఈ పాలసీలో నాలుగు ఆప్షన్ల కింద అందుబాటులో ఉంటుంది. మొదటి ఆప్షన్లో పిల్లలకి 25 ఏళ్లు వచ్చినప్పుడు ప్లాన్ పూర్తవుతుంది, అతను 10 లక్షలు సమ్ అష్యూర్డ్, 12 లక్షలు బోనస్గా, రూ. 4.50 లక్షలు చివరి అదనపు బోనస్గా పొందుతాడు. ఈ విధంగా మొత్తం రూ.26.50 లక్షలు అతడికి వస్తాయి.

Tags:    

Similar News