Ration Card: రేషన్ కార్డుదారులకి అలర్ట్.. ఈ పరిస్థితుల్లో మాత్రమే రేషన్ కార్డు రద్దు..!
Ration Card: రేషన్ తీసుకునే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
Ration Card: రేషన్ తీసుకునే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏ పరిస్థితుల్లో రేషన్‌కార్డు రద్దవుతుందనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. వాస్తవానికి కరోనా కాలంలో ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ వ్యవస్థను ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఈ పథకానికి అర్హులు కాని వారు కూడా చాలా మంది రేషన్ లబ్ధి పొందుతున్నట్లు తేలింది. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
మీరు కూడా అనర్హులై రేషన్ ప్రయోజనాన్ని పొందుతున్నట్లయితే ముందుగా దాని అర్హత గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాత మీరు కార్డును సరెండర్ చేయాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. ఉచిత రేషన్ నిబంధన ప్రకారం.. రేషన్ కార్డు హోల్డర్ సొంత ఆదాయంతో సంపాదించిన 100 చదరపు మీటర్ల ప్లాట్ లేదా ఇల్లు, నాలుగు చక్రాల వాహనం, ఆయుధ లైసెన్స్, గ్రామంలో రెండు లక్షలు, నగరంలో మూడు లక్షలకు మించి ఆదాయం ఉంటే మీరు ఉచిత రేషన్‌కు అర్హులు కాదు. అందుకే వెంటనే తహసీల్, డీఎస్‌ఓ కార్యాలయంలో రేషన్ కార్డును సరెండర్ చేయాల్సి ఉంటుంది.
వాస్తవానికి ఎప్పటికప్పుడు రేషన్ కార్డు లబ్ధిదారుల క్రమబద్ధీకరణ జరుగుతోంది. రేషన్ లబ్ధిదారుల నివేదికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అలాగే కొత్త కార్డుల పరిశీలన కూడా జరుగుతోంది. అలాగే రేషన్ షాపులలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే యోచన చేస్తుంది. దీనివల్ల పేదలకి నిత్యవసరాలు సరైన సమయంలో అందుతాయి.