Indian Railway Rules: జనరల్ కోచ్‌లో చోటు లేకపోతే స్లీపర్ కోచ్‌లో ప్రయాణించవచ్చా..?
Indian Railway Rules: జనరల్ కోచ్‌లో చోటు లేకపోతే స్లీపర్ కోచ్‌లో ప్రయాణించవచ్చా..?
Indian Railway Rules: భారతీయ రైల్వే దేశానికి జీవనాడి. తక్కువ ఛార్జీలు, సౌకర్యవంతమైన ప్రయాణం వల్ల దేశంలోని చాలామంది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి ఇందులోనే ప్రయాణిస్తారు. రైలులో వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 4 నెలల ముందుగానే సీట్లని బుక్ చేసుకుంటారు. అయితే చాలా సార్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించవలసి ఉంటుంది. దీని కోసం తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకుంటాం. కానీ తత్కాల్ టికెట్ లభించకపోతే జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కి ప్రయాణించడం మాత్రమే ఆప్షన్‌గా ఉంటుంది.
జనరల్ కంపార్ట్‌మెంట్ రద్దీతో నిండి ఉంది. కాలు పెట్టడానికి కూడా సందులేకుండా ఉంది. అప్పుడు ఏమి చేస్తారు. ఆ రైలు ఎక్కకుండా ఉంటారా.. రిస్క్ తీసుకొని రిజర్వ్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కుతారా..? రైల్వే చట్టం 1989 ప్రకారం మీ ప్రయాణం 199 కిమీ లేదా అంతకంటే తక్కువ అయితే జనరల్ కంపార్ట్‌మెంట్ టికెట్ 3 గంటల వ్యాలిడిటీ ఉంటుంది. అయితే దూరం దీని కంటే ఎక్కువ ఉంటే వ్యాలిడిటీ 24 గంటలకు పెరుగుతుంది. రైలు వచ్చినప్పుడు జనరల్ కోచ్‌లో అడుగు పెట్టడానికి స్థలం లేకపోతే నిబంధనల ప్రకారం తదుపరి రైలు కోసం వేచి ఉండాలి.
స్లీపర్ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ప్రయాణం 199 కి.మీల కంటే తక్కువగా ఉండి ఆ మార్గంలో మరో 3 గంటలపాటు రైలు లేకుంటే అదే రైలులో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించడానికి అర్హులవుతారు. అయితే మీరు ఆ కంపార్ట్‌మెంట్‌లో సీటు పొందలేరు. టీటీఈ రాగానే ఆ స్లీపర్ క్లాస్ కోచ్‌లో ఎందుకు వచ్చారో కారణం చెప్పాలి. ఈ సమయంలో స్లీపర్ క్లాస్‌లో ఏదైనా సీటు ఖాళీగా ఉంటే రెండు తరగతుల టిక్కెట్‌కు సరిపడా డబ్బు తీసుకొని టిటిఇ మీకు స్లీపర్ క్లాస్ టికెట్ ఇస్తారు. ఆ తర్వాత మీరు హాయిగా ప్రయాణించవచ్చు. స్లీపర్ కోచ్‌లో సీటు ఖాళీగా లేకుంటే తదుపరి స్టేషన్ వరకు TTE మిమ్మల్ని అనుమతించవచ్చు. తర్వాత కూడా మీరు స్లీపర్ క్లాస్ నుంచి బయటకు వెళ్లకపోతే రెండు వందల యాభై రూపాయల జరిమానా విధించవచ్చు.
వస్తువులు జప్తు చేయబడవు
జరిమానా చెల్లించడానికి డబ్బు లేకపోతే అతను మీకు చలాన్ చేస్తాడు. దానిని మీరు కోర్టులో సమర్పించాలి. ఇక్కడ విషయం ఏంటంటే TTE లేదా ఇతర పోలీసులు మిమ్మల్ని స్లీపర్ క్లాస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లమని చెప్పరు. మీ లగేజీని జప్తు చేయలేరు. మీకు జరిమానా మాత్రమే విధించగలరు. ఇది చెల్లించడం ద్వారా మీరు సీటు లేకుండా స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించవచ్చు.