పెట్టుబడిదారులకి గమనిక.. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పు..!
Interest Rate Hike: ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా పెట్టుబడిదారులకి శుభవార్త తెలిపింది.
Interest Rate Hike: ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా పెట్టుబడిదారులకి శుభవార్త తెలిపింది. జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి కొన్ని పథకాలు మినహా అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం అన్ని పథకాలపై 20 నుంచి 110 బేసిస్ పాయింట్లు పెంచారు. కోవిడ్ సమయంలో ఈ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి కొన్ని పథకాల వడ్డీ రేట్లు పెంచారు. ఈసారి పీపీఎఫ్ మినహా మిగతావన్నీ పెంచారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ జారీ చేసిన మెమోరాండం ప్రకారం వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు జనవరి 1, 2023 నుంచి 2022-23 నాల్గవ త్రైమాసికానికి సవరించారు.
1. నాల్గవ త్రైమాసికంలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ రేటు 6.8 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. అంటే ఇది 0.20 శాతం పెరిగింది.
2. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాల డిపాజిట్లు వరుసగా 5.5 శాతం, 5.7 శాతం, 5.8 శాతం, 6.7 శాతం ఉండేవి. కానీ ఇప్పుడు 6.6 శాతం, 6.8 శాతం, 6.9 శాతం, 7 శాతానికి పెంచారు.
3. 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్, సేవింగ్స్ డిపాజిట్ వడ్డీ రేట్లలో వరుసగా 5.8 శాతం, 4 శాతం ఉంది. వీటిలో ఎటువంటి మార్పు లేదు.
4. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ రేటు జనవరి 1 నుంచి 8 శాతం లభిస్తుంది. ప్రస్తుతం ఇది 7.6 శాతంగా ఉంది.
5. కిసాన్ వికాస్ పత్ర ప్రస్తుతం 120 నెలల మెచ్యూరిటీతో 7.2 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో ఇది 123 నెలల మెచ్యూరిటీతో 7 శాతంగా ఉండేది.
6. మరోవైపు పీపీఎఫ్ 7.10 శాతం, సుకన్య సమృద్ధి ఖాతా ఖాతా 7.6 శాతం ఎలాంటి మార్పు లేదు.